Begin typing your search above and press return to search.

ఓజీ - ఉస్తాద్.. ఏది ముందు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టారు.

By:  Tupaki Desk   |   26 Sept 2023 4:33 AM
ఓజీ - ఉస్తాద్.. ఏది ముందు?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టారు. ఓ వైపు ఎన్నికల నగారా దగ్గర పడుతున్న సమయంలో వీలైనంత వేగంగా ఈ రెండు చిత్రాలు ఫినిష్ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే ఉస్తాద్ భగత్ సింగ్ కి డేట్స్ ఇచ్చేసి ఏకదాటిగా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు.

ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కి సంబందించిన సీక్వెన్స్ అన్ని కూడా పూర్తి చేసే పనిలో హరీష్ శంకర్ ఉన్నారు. వచ్చే నెల మరల వారాహి యాత్రకి పవన్ సిద్ధమవుతున్నారు. ఈ లోపు పూర్తి చేయాలని హరీష్ భావిస్తున్నారు. వారాహి యాత్ర తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేస్తోన్న ఓజీ కోసం పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే సుజిత్ ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలు అన్ని షూట్ చేసేస్తున్నారు.

ఆయన ఒక నెల రోజులు డేట్స్ ఇస్తే మొత్తం మూవీ కంప్లీట్ అయిపోయే ఛాన్స్ ఉంది. దానికోసం సుజిత్ వెయిటింగ్ లో ఉన్నారు. ఈ రెండు సినిమాలు ఒకేసారి కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఓజీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న మూవీ కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే సీజే వర్క్ కూడా ఉంటుంది. పీరియాడికల్ జోనర్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓజీ మూవీ తెరకెక్కుతోంది.

ఆయితే ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ కమర్షియల్ జోనర్ లో తెరకెక్కుతోన్న చిత్రం కాస్తా పొలిటికల్ టచ్ కూడా మూవీకి ఉంటుంది. రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ తనదైన శైలిలో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండింటిలో ఒక సినిమాని ఎన్నికల లోపు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. వీటిలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఛాయస్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కనిపిస్తోంది.

దీనిలో పొలిటికల్ సెటైరికల్ డైలాగ్స్ కూడా కథలో భాగంగా ఉంటాయని తెలుస్తోంది. ఇవి తన పొలిటికల్ మైలేజ్ కి కొంత వరకు ప్లస్ అవ్వొచ్చని అనుకుంటున్నారు. ఓజీ కంప్లీట్ గా మాఫియా నేపథ్యంలో నడిచే కథ కాబట్టి కంటెంట్ ఎలివేట్ చేసే డైలాగ్స్ తప్ప నేటివిటీకి సింక్ అయ్యేవి ఉండకపోవచ్చు. సుజిత్ కూడా ఆలస్యం అయిన అవుట్ పుట్ పెర్ఫెక్ట్ గా వచ్చిన తర్వాత రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ముందుగా రిలీజ్ కావడానికి ఛాన్స్ ఉంది.