Begin typing your search above and press return to search.

OG అసలు కిక్కు.. గేట్ రెడీ!

ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన హాంగ్రీ చీతా అనే లిరికల్ సాంగ్ రాబోతున్నట్లుగా ఒక క్లారిటీ వచ్చేసింది.

By:  Tupaki Desk   |   27 Sep 2023 11:33 AM GMT
OG అసలు కిక్కు.. గేట్ రెడీ!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న డిఫరెంట్ మాఫియా గ్యాంగ్ స్టర్ మూవీ OG పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. RRR సినిమా తర్వాత డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం ఫాన్స్ అయితే ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని పోస్టర్స్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది.

ఇక దర్శకుడు సుజిత్ గ్యాప్ లేకుండా సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యే విధంగా అప్డేట్స్ అయితే ఇస్తూ వచ్చాడు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా అంచనాల స్థాయిని మరింత పెంచింది. దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హాంగ్రీ చీతా అంటూ ఇచ్చిన ఎలివేషన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఆకట్టుకుంది.

తప్పకుండా ఈ సినిమాతో ఫ్యాన్స్ కు సరికొత్త క్లిక్ ఇవ్వబోతున్నట్లు అంచనాలు అయితే ఏర్పడుతున్నాయి. కానీ ఇటీవల కాలంలో థమన్ ఇచ్చిన ట్యూన్స్ కు మాత్రం ఏదో ఒక విధంగా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇక OG సినిమాపై మాత్రం ఫ్యాన్స్ కొంత అంచనాలు అయితే పెంచుకున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన హాంగ్రీ చీతా అనే లిరికల్ సాంగ్ రాబోతున్నట్లుగా ఒక క్లారిటీ వచ్చేసింది.

సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న కే రవిచంద్రన్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆయన థమన్ తో దిగిన ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ హాంగ్రీ చీతా అనే ఫస్ట్ సాంగ్ రాబోతోంది అని వివరణ ఇచ్చారు. దీంతో ఈ సాంగ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిటింగ్ అంటూ మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించబోతున్నాడు. దర్శకుడు ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక మిగిలిన షూటింగ్ ను మరొక రెండు నెలల్లోనే ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేసే అవకాశం ఉంది.