Begin typing your search above and press return to search.

OG లీక్స్.. గ్యాంగ్ స్టర్ ఫ్యామిలీ ఎమోషన్

వివరాళ్లోకి ఈ ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది

By:  Tupaki Desk   |   15 Sep 2023 6:40 AM GMT
OG లీక్స్.. గ్యాంగ్ స్టర్ ఫ్యామిలీ ఎమోషన్
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ యాక్షన్ గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) ఒకటి. ఇప్పటికే విడుదలై హంగ్రీ చితా గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా కథ గురించి ఓ వార్త బయటకు వచ్చి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

వివరాళ్లోకి ఈ ఓజీ చిత్రంలో పవన్ కల్యాణ్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. ఎస్ తమ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ కు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది. ఇది సినిమాపై మరింత భారీ అంచనాలను పెంచేసింది.

ఈ క్రమంలోనే ఓజీ కథకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. ముంబయి నగరానికి ఓజాస్ గంభీర్ అనే టూరిస్ట్ ఓ సాధారణ వ్యక్తిగా వస్తాడట. అయితే అనుకోని పరిస్థితుల్లో అతడు గ్యాంగ్ స్టర్ గా మారడం, ఆ తర్వాత కుటుంబాన్ని కోల్పోతాడట. దీంతో తన కుటుంబం కోల్పోవడానికి కారణణైన శత్రువులపై అతడు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు అనే కథాంశంతో ఈ ఓజీ తెరకెక్కుతుందని తెలిసింది. ఈ విషయాన్ని ప్రముఖ ఇంటర్నెట్ రేటింగ్ సంస్థ ఐఎండీబీ తమ పోర్టల్ లో పోస్ట్ చేసిందట.

వాస్తవానికి ఈ కథ చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. కాకపోతే మళ్లీ ఇదే విషయం తెరపైకి వచ్చింది. మరి నిజంగానే ఈ కథతో ఓజీ వస్తుందా? లేదంటే ఏదైనా మార్పులతో వస్తుందా అనేది తెలియాలి. ఒకవేళ ఇదే కథ అయినప్పటికీ దర్శకుడు సుజీత్.. థ్రిల్ చేసే సన్నివేశాలు, యాక్షన్ బ్లాక్స్ తో ఎలా చూపిస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఇకపోతే ఈ ఓజీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముందని తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పటికే ముంబయిలో పలు షెడ్యూళ్లను చిత్రీకరించారు. డీవీవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన నుంచి రాబోతున్న చిత్రమిది.