Begin typing your search above and press return to search.

ఓజీ క్రేజీ ప్లాన్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో..?

పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ కూడా ఒకటి. ఇప్పటి వరకు అయితే, అధికారికంగా మూవీ టైటిల్ ప్రకటించలేదు

By:  Tupaki Desk   |   5 Sept 2023 12:10 PM IST
ఓజీ క్రేజీ ప్లాన్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో..?
X

పవర్ స్టాన్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ కూడా ఒకటి. ఇప్పటి వరకు అయితే, అధికారికంగా మూవీ టైటిల్ ప్రకటించలేదు. కానీ, వర్కింగ్ టైటిల్ గా ఓజీ ( ఓన్లీ గ్యాంగ్ స్టార్) గా పిలుస్తున్నారు. ఈ మూవీకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. గత ఐదేళ్లుగా పవన్ కేవలం రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. చాలా కాలం తర్వాత ఆయన నుంచి వస్తున్న స్ట్రయిట్ మూవీ ఇదే కావడం విశేషం. దీంతో, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

ఇటీవల, ఈ మూవీ నుంచి ఓ టీజర్ విడుదల చేయగా, ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు. ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్లు పవన్ ని డైరెక్ట్ చేశారు.చాలా మంది ఎలివేషన్స్ కూడా ఇచ్చి ఉండొచ్చు. కానీ, ఓజీ మాత్రం అంతకు మించి అనే భావన కలిగింది. కేవలం టీజర్ తో అరుపులు పెట్టించాడు. ఇది జస్ట్ టీజర్ మాత్రమే, ఇక సినిమా చూస్తే ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవడం ఖాయం అని తెలుస్తోంది.

కాగా, తాజాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికర విషయం తెలిసింది. ఓజీ కేవలం సింగిల్ పార్ట్ కాదట, రెండు భాగాలుగా తీయాలని అనుకుంటున్నారట. మొదటి పార్ట్ లో పవన్ ఎక్కువ కనపడకపోవచ్చని తెలుస్తోంది. కానీ, రెండో పార్ట్ మొత్తం పవన్ చక్రం తిప్పేస్తాడట. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ చేయగా, ఆ సీక్వెన్స్ చూసి పవనే షాకయ్యాడు.

సుజిత్ మేకింగ్ కి పవన్ ఫిదా అయిపోయినట్లు సమాచారం. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ అవుతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ విషయాలన్నీ ఫ్యాన్స్ కి విపరీతమైన కిక్ ఇస్తున్నాయి. కానీ, మొదటి పార్ట్ లో పవన్ ఎక్కువ సేపు కనపడకపోవచ్చు అనే విషయమే జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంది.

మరి, పవన్ ఎక్కువ సేపు కనపడకున్నా, ఫ్యాన్స్ ని మెప్పించడం అంటే సాహసమనే చెప్పాలి. మరి ఆ సాహాసాన్ని చేస్తున్న సుజిత్ ఎంత వరకు వర్కౌట్ అవుతాడో చూడాలి. ఇక, ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది.