Begin typing your search above and press return to search.

డిసెంబర్ టార్గెట్.. OG వస్తే సైడ్ ఇవ్వాల్సిందే..

టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ తో కలిపి డిసెంబర్ లో రిలీజ్ కాబోయే చిత్రాల

By:  Tupaki Desk   |   31 July 2023 11:51 AM GMT
డిసెంబర్ టార్గెట్.. OG వస్తే సైడ్ ఇవ్వాల్సిందే..
X

ఈమధ్య పాన్ ఇండియా కల్చర్ స్టార్ట్ అయిన తర్వాత సినిమాల పోటీ కేవలం ఒక భాషకి పరిమితం కాలేదు. ప్రేక్షకుల భాషా నటులతో సంబంధం లేకుండా కంటెంట్ నచ్చితే చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే తెలుగు మూవీస్ నార్త్ ఇండియాలో సక్సెస్ అందుకుంటున్నాయి. అలాగే బ్రహ్మాస్త్ర, పఠాన్ లాంటి హిందీ సినిమాలు టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్నాయి.

ఇలా మార్కెట్ స్కోప్ పెరగడంతో స్టార్స్ అందరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు. డిసెంబర్ లో ఈ ఏడాది వరుస సినిమాలు ఉన్నాయి. వాటిలో చాలా వరకు బజ్ ఉన్నవే కావడం విశేషం. ఈ సినిమాలలో వేటికవే ప్రతేకం అని చెప్పాలి. టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ తో కలిపి డిసెంబర్ లో రిలీజ్ కాబోయే చిత్రాల జాబితా చూసుకుంటే రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ కానుంది.

ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ మూవీ డిసెంబర్ 15న రిలీజ్ కానుంది. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హాయ్ నాన్న మూవీ డిసెంబర్ 21న రిలీజ్ చేయనున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.

జ్ఞానసేఖర్ దర్శకత్వంలో సుదీర్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న హరోం హర మూవీ డిసెంబర్ 22న రిలీజ్ చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. అలాగే డుంకీ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. నితిన్ ఎక్స్ ట్రా రిలీజ్ డేట్ డిసెంబర్ 23గా ఎనౌన్స్ చేశారు. విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా కూడా డిసెంబర్ లోనే రానుంది.

వీటితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఒజీ మూవీ డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ ఆ సమయానికి OG రిలీజ్ అయితే మాత్రం కచ్చితంగా చాలా సినిమాలు క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకోవాల్సిందే. ఒజీ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ పవన్ కళ్యాణ్ షూటింగ్ సీక్వెన్స్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది.