Begin typing your search above and press return to search.

పవన్ సినిమాపై ఇంత సిల్లీ ప్రచారమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్‌లో పెట్టిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో చాలా ముందుగా మొదలైంది ఇదే.

By:  Tupaki Desk   |   14 Feb 2024 3:00 AM GMT
పవన్ సినిమాపై ఇంత సిల్లీ ప్రచారమా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్‌లో పెట్టిన సినిమాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఆయన చేతిలో ఉన్న సినిమాల్లో చాలా ముందుగా మొదలైంది ఇదే. ఆ తర్వాత లైన్లోకి వచ్చిన ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ చిత్రాలు ఆల్రెడీ రిలీజైపోయాయి. వీటి తర్వాత పట్టాలెక్కిన ‘ఓజీ’ కూడా త్వరలోనే పూర్తయ్యేలా ఉంది. ఆ చిత్రానికి సెప్టెంబరు 27కు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.

ఎన్నికలు అయ్యాక ‘ఓజీ’తో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’నూ పవన్ తక్కువ టైంలో పూర్తి చేయబోతున్నారని వార్తలొచ్చాయి. మరి ‘హరిహర వీరమల్లు’ పరిస్థితి ఏంటనే సందేహం అందరినీ వెంటాడింది. కానీ వెబ్ మీడియా, సోషల్ మీడియాలో ఉన్నట్లుండి ఈ సినిమా గురించి అర్థరహితమైన ప్రచారం జరిగింది. క్రిష్ ఈ సినిమా నుంచి బయటికి వెళ్లిపోయాడని.. సినిమాను మొత్తంగా ఆపేస్తున్నారని.. ఈ సినిమా ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం పవన్ నిర్మాత ఎ.ఎం.రత్నంకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఊహాగానాలు సృష్టించారు.

ఐతే పవన్‌‌కు ఉన్న వేరే కమిట్మెంట్ల వల్ల భారీ చిత్రం అయిన ‘హరిహర వీరమల్లు’కు వరుసగా డేట్లు ఇవ్వలేక ఈ సినిమా ఆలస్యం అయింది తప్ప ఇది ఆషామాషీ సినిమా కాదు. ఆల్రెడీ నిర్మాత రత్నం వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. 80 శాతం పైగా షూటింగ్ అయిపోయింది. క్రిష్ అంటే అల్లా టప్పా సినిమాలు తీసే రకం కాదు. ఈ సినిమా నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన ప్రోమోలన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి.

ఆలస్యం అవుతోందన్న మాటే కానీ.. రిలీజైనపుడు దీనికి ఉండే క్రేజే వేరుగా ఉంటుంది. అన్నీ కుదరితే పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న అలాంటి సినిమాను ఎవరైనా ఆపి పక్కన పడేస్తారా? ఈ సినిమా తిరిగి పట్టాలెక్కడానికి టైం పడుతుంది కాబట్టి దాని వీఎఫెక్స్ పనులు పర్యవేక్షిస్తూనే.. అనుష్కతో తక్కువ బడ్జెట్లో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయాలని క్రిష్ చూస్తుండేసరికి ఈ అర్థం లేని ప్రచారాలు తెరపైకి వచ్చాయి. దీంతో నిర్మాణ సంస్థ స్పందించి సినిమా గురించి అప్‌‌డేట్ ఇవ్వాల్సి వచ్చింది.