Begin typing your search above and press return to search.

ఏంటి.. పవన్ 'డైరెక్టర్లు' అలా చేస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   27 Feb 2024 6:05 AM GMT
ఏంటి.. పవన్ డైరెక్టర్లు అలా చేస్తున్నారా?
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్.. పాలిటిక్స్ పైనే పూర్తి దృష్టి పెట్టారు. దీంతో తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పక్కన పెట్టేశారు. షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చేశారు. ఎన్నికల తర్వాతే మళ్లీ సెట్స్ లో అడుగు పెడతానని ఆయా మేకర్స్ కు క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆ సినిమాలు హోల్డ్ లో ఉన్నాయి.

పవన్ నటిస్తున్న మూడు ప్రాజెక్టులు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ప్రస్తుతం పవన్ లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో హోల్డ్ మోడ్ లోనే ఉన్నాయి. అయితే ఈ మూడు సినిమాల షూటింగ్ 2023లో పూర్తి కావాల్సి ఉంది. కానీ పవన్ వల్లే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దీంతో ఈ ప్రాజెక్టులు మళ్లీ కరెక్ట్ గా ఎప్పుడు స్టార్ట్ అవుతాయన్న విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. దీంతో ఆయా డైరెక్టర్లు.. తమ కొత్త సినిమాల్లో బిజీ అయిపోయారు.

హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయ్యి చాలా ఏళ్లు అవుతోంది. ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ ఇటీవల మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొత్త షెడ్యూల్ కు పవన్ ఎప్పుడు ఓకే చెప్తారో తెలియకపోవడంతో డైరెక్టర్ క్రిష్.. అనుష్కతో ఇప్పుడు మూవీ తీస్తున్నారు.

మరోవైపు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల దర్శకులు హరీశ్ శంకర్, సుజిత్ కూడా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హరీశ్ శంకర్.. రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా మిస్టర్ బచ్చన్ రూపొందుతోంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ.. ఇటీవల కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక రవితేజ తన హోప్స్ అన్నీ ఈ మూవీ పైనే పెట్టుకున్నారు.

నేచురల్ స్టార్ నానితో సినిమా తీసేందుకు ఓజీ దర్శకుడు సుజిత్ సిద్ధమయ్యారు. ఇటీవల నాని బర్త్ డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒక హింసాత్మక వ్యక్తి అహింసాత్మకంగా మారినప్పుడు, అతడి ప్రపంచం తలకిందులుగా మారుతుందని, అదే సినిమా బేసిక్ స్టోరీ లైన్ అని తెలిపారు. పవర్ తర్వాత లవర్ అంటూ నాని పోస్ట్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలిపారు. మొత్తానికి పవన్ దర్శకులంతా తమ కొత్త ప్రాజెక్టుల్లో బిజీ అయ్యారన్నమాట.