Begin typing your search above and press return to search.

చేస్తున్న సినిమా టైటిల్​నే​ మర్చిపోతే ఎలా?

అయితే పవన్ 'ఉస్తాద్' అనకుండా 'సర్దార్​ భగత్ సింగ్' అని అన్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వారు 'ఉస్తాద్' అని హింట్ ఇవ్వడంతో మాటను అందుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Oct 2023 5:56 PM GMT
చేస్తున్న సినిమా టైటిల్​నే​ మర్చిపోతే ఎలా?
X

పలు సందర్భాల్లో కొన్ని విషయాల గురించి మర్చిపోవడం సహజంగానే జరుగుతుంటుంది. అది సామాన్యుడికైనా లేదా ఓ సెలబ్రిటీకైనా. అయితే తాజాగా ఇలాంటి సంఘటన పవర్ స్టార్ పవన్ కల్యాణ్​కు ఎదురైంది. అయితే అది ఏకంగా తాను నటిస్తున్న సినిమా టైటిల్​ గురించే మర్చిపోవడం గమనార్హం. ఇక ఇది తెలుసుకుంటున్న ఓ వర్గానికి చెందిన నెటిజన్లు, అభిమానులు.. దీనిపై ఫన్నీ ట్రోల్స్ చేస్తున్నారు.

వివరాళ్లోకి వెళితే.. మహా మ్యాక్ ఎంటర్​టైన్మెంట్​ ఛానల్ లాంఛ్ ఈవెంట్​లో పాల్గొన్న పవన్ కల్యాణ్​.. స్టేజ్​పై స్పీచ్ ఇచ్చేటప్పుడు 'ఉస్తాద్​ భగత్ సింగ్' సినిమా గురించి ప్రస్తావన వచ్చింది. అయితే పవన్ 'ఉస్తాద్' అనకుండా 'సర్దార్​ భగత్ సింగ్' అని అన్నారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వారు 'ఉస్తాద్' అని హింట్ ఇవ్వడంతో మాటను అందుకున్నారు. అలా తాను నటిస్తున్న సినిమా పేరునే మర్చిపోయారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై ఫన్నీ ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఈ వీడియోలను ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్​కు ట్యాగ్ చేస్తున్నారు. 'అవమానం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి హరీశ్ తనదైన స్టైల్​లో సమాధానం ఇచ్చారు. 'హహహ అవమానమా.. ఎంత పెద్ద పదం.. పర్లేదు గుర్తు చేయడానికి, గుర్తుండిపోయే సినిమా తీయడానికి, మేమంతా కష్టపడుతున్నాం..' అని రాసుకొచ్చారు.

అయితే ఈ ట్వీట్​కు మరో నెటిజన్​ తిరిగి.. 'ఎంత గుర్తుండిపోయే సినిమా తీసినా ముందు ఆయన చూడాలిగా' అంటూ కామెంట్​ పెట్టారు. దానికి మళ్లీ హరీశ్ శంకర్​.. 'ఆయన చూడ్డానికి కాదు …. ఆయనను చూపించడానికి తీస్తున్న' అంటూ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ అన్నీ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఏదీఏమైనా పవన్​ తాను చేసే సినిమా టైటిల్​ను మర్చిపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు నెటిజన్లు.

కాగా, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ విషయానికొస్తే.. గబ్బర్‌ సింగ్‌ తర్వాత పవన్‌-హరీశ్‌ శంకర్‌ల కాంబినేషన్‌లో రానున్న చిత్రమిది. పవన్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. శ్రీలీల హీరోయిన్. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.