Begin typing your search above and press return to search.

ఇదెక్కడి పిచ్చిరా బాబు.. పవన్ కోసం రక్తం వచ్చేలా..!

టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే

By:  Tupaki Desk   |   1 Aug 2023 6:03 AM GMT
ఇదెక్కడి పిచ్చిరా బాబు.. పవన్ కోసం రక్తం వచ్చేలా..!
X

టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే, అందరికీ ఫ్యాన్స్ ఉంటే, పవన్ కి మాత్రం భక్తులు ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ ని ఓ హీరోలా కాకుండా, ఆయన ఫ్యాన్స్ దేవుడిలా భావిస్తూ ఉంటారు. ఇక ఆయనపై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించడానికి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు.

అయితే, తాజాగా ఓ వ్యక్తి పవన్ కోసం ఏకంగా రక్తం చిందించాడు. బ్రో సినిమా ఆడుతున్న ఓ థియేటర్ ముందు నానా హడావిడి చేశాడు. మదనపల్లిలోని ఓ థియేటర్ లో బ్రో మూవీ ఆడుతోంది. అక్కడ మూవీ చూడటానికి వచ్చిన అభిమాని, పవన్ పోస్టర్ ముందు నిలపడి బ్లేడ్ తీసుకొని చెయ్యి కోసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కోసం రక్తం, ప్రాణం ఇస్తానంటూ హల్ చల్ చేశాడు. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అయితే, సదరు అభిమాని చేసిన పనిపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. అభిమానం అందరికీ ఉంటుంది. కానీ, మరీ ఇలా చేతులు కోసుకునేలా ఉండకూడదు అని అతను చేసిన పనిపై మండిపడుతున్నారు. పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే, ప్రాణాలకే ప్రమాదం కదా ఇలా చేయకూడదు అని సలహాలు ఇస్తున్నారు.

ఇదిలా ఉండగా, పవన్ ఇటీవల బ్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తొలిసారి ఆయన తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది. ఈ మూవీలో పవన్ వింటేజ్ లుక్ లో కనిపించాడు. ఈ మూవీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీని ఇచ్చింది.

ఇదిలా ఉండగా, పవన్ చేతిలో మరో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. అవి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీపడటానికి రెడీగా ఉన్నారు. ముఖ్యమంత్రి అవ్వడమే లక్ష్యంగా ఆయన రాజకీయంగా తన పావులు కదుపుతున్నారు.