Begin typing your search above and press return to search.

ఫుల్ బిజీ.. అయినా ఫ్యాన్స్ కోసం పవన్ ఇలా!

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను షేర్ చేసింది మైత్రీ సంస్థ. మార్చి 19న గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   17 March 2024 8:50 AM GMT
ఫుల్ బిజీ.. అయినా ఫ్యాన్స్ కోసం పవన్ ఇలా!
X

సూపర్ హిట్ మూవీ గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ రోల్ లో దుమ్ముదులిపేయనున్నారు. పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తున్న ఈ మూవీపై సినీ ప్రియులతోపాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మంచి హైప్ నెలకొంది.

కొద్దిరోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్.. పవన్ బిజీగా మారడం వల్ల బ్రేక్ పడింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో కలిసి పవన్ బరిలో దిగిన విషయం తెలిసిందే. అయితే పవన్ మళ్లీ మూవీ సెట్స్ లో అడుగుపెడతారో చెప్పలేం. దీంతో హరీష్ శంకర్.. రవితేజతో ఇటీవల మూవీ స్టార్ట్ చేశారు. హిందీ సూపర్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా మిస్టర్ బచ్చన్ ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు.

అయితే రవితేజతో హరీష్ శంకర్ మూవీ స్టార్ చేసినప్పుడు.. చాలా మంది పవన్ ఫ్యాన్స్ ఉస్తాద్ కోసం అడిగారు. కానీ మేకర్స్ స్పందించలేదు. ఇప్పుడు సడెన్ గా ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్పెక్ట్ ది అన్ ఎక్స్పెక్టెడ్ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చి మరింత క్యూరియాసిటీ పెంచేశారు ఉస్తాద్ మేకర్స్.

ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కు పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను షేర్ చేసింది మైత్రీ సంస్థ. మార్చి 19న గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ చేసింది. అంటే మరో రెండు రోజుల్లోనే గ్లింప్స్ రిలీజ్ కానుందన్నమాట. అయితే పిక్స్ లో పవన్ తోపాటు హరీష్ కనిపిస్తున్నారు. పవన్ వైట్ అండ్ వైట్ కుర్తా పైజామా లో ఉన్నారు. అంటే పొలిటికల్ మీటింగ్ నుంచి నేరుగా డబ్బింగ్ చెప్పేందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఉస్తాద్ మేకర్స్ షేర్ చేసిన పిక్స్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. వర్క్ డెడికేషన్ అంటే ఇదేనని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఫర్ సాలిడ్ గ్లింప్స్ అంటూ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ గ్లింప్స్ లో పొలిటికల్ డైలాగ్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అవి కూడా ప్రభుత్వంపై కౌంటర్ వేసేలా ఉంటాయట. మొత్తానికి ఉస్తాద్ గ్లింప్స్ ఎలాంటి సంచలనం సృష్టించనుందో మరి.