Begin typing your search above and press return to search.

బ్రో వాళ్లకి కలిసి వస్తుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుంది. వినోదయ సీతం రీమేక్ గా వచ్చిన బ్రో సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగినట్టుగా మార్పులు చేశారు.

By:  Tupaki Desk   |   30 July 2023 5:55 AM GMT
బ్రో వాళ్లకి కలిసి వస్తుందా..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తుంది. వినోదయ సీతం రీమేక్ గా వచ్చిన బ్రో సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగినట్టుగా మార్పులు చేశారు. పవన్ ఎనర్జీతో సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు భామలు తమ లక్ టెస్ట్ చేసుకున్నారు. వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్, మరో హాట్ బ్యూటీ కెతిక శర్మ ఇద్దరు బ్రో సినిమాతో సక్సెస్ రుచి చూశారు.

ఒరు ఆధార్ లవ్ సినిమాలోని టీజర్ తో సినిమాపై బీభత్సమైన క్రేజ్ తెచ్చుకున్న ప్రియా ప్రకాష్ ఆ తర్వాత వరుస సినిమాలు అందుకుంటుంది అనుకున్నా అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఆల్రెడీ తెలుగులో ప్రయత్నాలు మొదలు పెట్టినా అవి సరిగా ఆడలేదు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ సినిమాతో అమ్మడికి ఫస్ట్ హిట్ కొట్టింది. అటు రొమాంటిక్ బ్యూటీ కెతిక కూడా ఇప్పటికే తెలుగులో 3 సినిమాలు చేసినా ఏ ఒక్కటి వర్క్ అవుట్ కాలేదు. పవన్ సినిమాతో ఈ ఇద్దరి భామలకు లక్ కలిసి వచ్చింది.

పవన్ బ్రో సినిమా మరోసారి వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూపించి పిచ్చెక్కించేశాడు. అయితే కొందరు న్యూట్రల్ ఆడియన్స్ సినిమా గురించి జస్ట్ ఓకే అంటూ చెబుతున్నా వసూళ్లు మాత్రం పవర్ స్టార్ రేంజ్ ని చూపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటుగా ఈ సినిమాతో సాయి తేజ్ కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. విరూపాక్ష సినిమాతో రీసెంట్ గానే ఒక హిట్ అందుకున్న సాయి తేజ్ మేనమామ పవన్ తో సూపర్ హిట్ కొట్టాడు.

తెలుగులో నటుడిగా మెప్పిస్తూ వస్తున్న సముద్రఖని తన డైరెక్షన్ టాలెంట్ కూడా చూపించాడు. అప్పుడెప్పుడో శంబో శివ శంబో సినిమాను డైరెక్ట్ చేసిన అతను తెలుగులో మళ్లీ మెగా ఫోన్ పట్టి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మాంచి గిఫ్ట్ ఇచ్చాడు. పవన్ బ్రో సినిమాతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఖాతాలో మరో హిట్ దక్కినట్టు అయ్యింది. బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను కూడా ఈ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. వాటితో పాటుగా వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్.