Begin typing your search above and press return to search.

'బ్రో' గుడ్​ న్యూస్​.. పవన్​ వచ్చేస్తున్నాడహో!

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. జులై 25న శిల్ప కలా వేదికలో ఈ ఈవెంట్​ను నిర్వహిస్తారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2023 6:45 AM GMT
బ్రో గుడ్​ న్యూస్​.. పవన్​ వచ్చేస్తున్నాడహో!
X

'బ్రో' రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది.. ప్రమోషన్స్​ లో జోరు కనిపించట్లేదే? ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ నిర్వహిస్తారు? పొలిటిక్స్​ క్యాంపైన్​లో ఉన్న పవన్ కల్యాణ్​ అసలీ ఈవెంట్​కు వస్తారా? రారా? అంటూ గత కొద్ది రోజులుగా అభిమానుల్లో, సినీ ప్రియుల్లో ఈ ప్రశ్నల గురించే చర్చ. ఎట్టకేలకు దీనిపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానాలు దొరికాయనే చెప్పొచ్చు.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. పవర్​ స్టార్ పవన్ కల్యాణ్​ - మెగా హీరో మేనల్లుడు సాయి తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్​ సినమా 'బ్రో'. జులై 29న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. అంటే మరో 11 రోజుల్లో ఈ చిత్రం ఆడియెన్స్​, అభిమానుల ముందుకు రానుంది. మరి ఇలాంటి సమయంలో ప్రమోషన్స్​ అంటే ఎలా ఉండాలి. గ్యాప్ లేకుండా మారుమోగిపోవాలి. మేకర్స్.. సినిమా చిత్రీకరణను ఎంత వేగంగా కంప్లీట్​ చేశారో.. ఇప్పుడీ సినిమా ప్రమోషన్స్​ విషయంలో కాస్త స్లో అయ్యారనే టాక్​ ఎక్కువగా వినిపిస్తోంది.

నిజానికి పవన్ సినిమా అంటే.. రిలీజ్​ కు నెల రోజుల ముందు నుంచే అభిమానుల్లో ఉత్సాహం వచ్చేస్తుంది. సోషల్​ మీడియాలో ఎక్కడ చూసిన పవన్​కు సంబంధించిన సాంగ్స్​, ప్రచార చిత్రాలతో సందడి వాతావరణం కనిపిస్తుంటుంది.

కానీ 'బ్రో' విషయంలో ఈ హడావుడి కాస్త తక్కువగానే కనిపిస్తోంది. మూవీటీమ్​ కూడా రెండు పాటలు, ఓ టీజర్​ వదిలి చప్పుడు చేయకుండా కూర్చుంది. అవి కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని అంటున్నారు. సినిమాపై హైప్​ కూడా భారీగా కనిపించట్లేదు. ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు సంబంధించి ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారనే ఎటువంటి సమాచారం కూడా బయటకు రాలేదు.

మరోవైపు ప్రస్తుతం పవన్​ ఏపీ రాజకీయాలంటూ వారాహి విజయ యాత్రలో ఖాళీ లేకుండా వరుస షెడ్యూల్స్​తో తిరుగుతున్నారు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్​కు పవన్ రాడని, కేవలం సాయితేజ్​ ఒక్కడే వస్తారని ప్రచారం సాగుతోంది. అయితే పవన్​ ఎంటర్ అయితేనే సినిమా హైప్​ పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని అందించే వార్త బయటకు వచ్చింది.

తాజాగా అందిన సమాచారం ప్రకారం.. జులై 25న శిల్ప కలా వేదికలో ఈ ఈవెంట్​ను నిర్వహిస్తారని అంటున్నారు. అలాగే పవన్​ కూడా తన బిజీ షెడ్యూల్స్​ మధ్యలో కాస్త విరామం తీసుకుని ఈ కార్యక్రమానికి​ హాజరవుతారని తెలిసింది. ఇప్పటికే ఈ విషయం చిన్న చిన్నగా తెలుసుకుంటున్న అభిమానుల్లో జోష్ పెరుగుతోంది. ఇక పవన్​ వస్తున్నాడంటే ఈ ఈవెంట్​కు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చి ఎలా రచ్చ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా హైప్​ ఆటోమెటిక్​గా మరింత పెరిగిపోతుంది.