Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ మావ‌య్య చిన్న మేన‌ల్లుడికి విలువైన‌ సల‌హా!

మెగా మేన‌ల్లుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్ తేజ్ జ‌ర్నీ స‌క్సెస్ ఫుల్ గా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Nov 2023 6:38 AM GMT
ప‌వ‌న్ మావ‌య్య చిన్న మేన‌ల్లుడికి విలువైన‌ సల‌హా!
X

మెగా మేన‌ల్లుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్ తేజ్ జ‌ర్నీ స‌క్సెస్ ఫుల్ గా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. `ఉప్పెన‌`తో లాంచ్ అయిన హీరో అటుపై `కొండ పొలం` లాంటి డిఫ‌రెంట్ సినిమాతోనే ఆక‌ట్టుకున్నాడు. `రంగ‌రంగ వైభ‌వంగా` కాస్త నిరాశ‌ప‌రిచినా వైష్ణ‌వ్ పై ఆ ప్ర‌భావం పెద్ద‌గా ప‌డ‌లేదు. స్టోరీల ఎంపిక ప‌రంగా మెగా హీరోల్లో వ‌రుణ్ తేజ్ త‌ర్వాత వైష్ణ‌వ్ ఇన్నోవేటివ్ గా వెళ్తున్నాడ‌ని తెలుస్తోంది.

క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌తో పాటు వైవిథ్య‌మైన కంటెంట్ కి పెద్ద పీట వేస్తున్నాడు. యంగ్ హీరో స్టోరీ సెల‌క్ష‌న్ బాగుంది అనే పాజిటివ్ సైన్ ప‌డింది. ఇంకా చెప్పాలంటే? సాయితేజ్ క‌న్నా...వైష్ణ‌వ్ బెట‌ర్ అనే టాక్ వినిపిస్తుంది. తాజాగా ఆదికేశ‌వ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు. ఈనేప‌థ్యంలో త‌న కెరీర్ గురించి..ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇచ్చిన టిప్స్ గురించి రివీల్ చేసాడు. ఆవేంటో ఆయ‌న మాట‌ల్లోనే..

`నేనెప్పుడు క‌థ‌ల్లో కొత్త‌ద‌నం ఉండాల‌ని కోరుకుంటాను. ఈ త‌రానికి న‌చ్చేలా ఉండాల‌నుకుంటా. నా పాత్ర‌లో క‌మర్శియ‌ల్ గా క‌నెక్ట్ అయ్యేలా చూసుకుంటా. న‌న్ను నేను హీరో అని ఎప్పుడు అనుకోను. ఎంచుకునే పాత్ర‌ల‌కు న్యాయం చేసే న‌టుడిగానే భావిస్తా. అందుకు ఓ ప్ర‌త్యేక కార‌ణం ఉంది. నేను సినిమాల్లోకి వ‌చ్చేముందు..వ‌చ్చిన త‌ర్వాత ప‌వ‌న్ మావ‌య్య ఎప్పుడూ క‌నిపించినా ఒకే మాట చెబుతారు.

నువ్వొక మంచి న‌టుడిగా పేరు తెచ్చుకోవాలంటే? ఏ పాత్ర‌లోనైనా స్వేచ్ఛ‌గా ఒదిగిపోయేలా ఉండాలి. అప్పుడే వైవిథ్య‌మైన పాత్ర‌లు చేసే అవ‌కాశం ఉంటుంది అన్నారు. ఆయ‌న మాట‌ను చాలా బ‌లంగా న‌మ్ముతాను. ఏ సినిమా క‌థ విన్న మావ‌య్య కోణంలో..ఆయ‌న చెప్పిన విష‌యాలు గుర్తు చేసుకుని విశ్లేషించుకుంటా. కొన్ని క‌థ‌లు విని రెడీగా పెట్టుకున్నాను. వాటి వివ‌రాలు త్వ‌ర‌లో రివీల్ చేస్తా` అని అన్నారు.