సింగపూర్ ఘటన తర్వాత పవన్ నిర్ణయం!
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 April 2025 11:17 AM ISTపవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, చిరంజీవి, సురేఖ అంతా సింగపూర్ లోనే ఉన్నారు. కుమారుడి ఆరోగ్యాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. కులదైవం అంజనేయస్వామి దయవల్ల పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపట్టాడని చిరంజీవి కుదుట పడ్డారు. అయితే మార్క్ శంకర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకు మరింత సమయం పడుతుంది.
అయితే పవన్ ఇప్పుడు సింగపూర్ లో ఎన్ని రోజులు ఉంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన కేవలం నటుడి గానే ఉంటే? షూటింగ్ లు అన్ని పక్కనబెట్టేసి కోలుకునే వరకూ ఉండే అవకాశం ఉంటుం ది. కానీ పవన్ ఏపీలో డీప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు వహిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఈ క్రమంలో కూటమిలో అతడి పాత్ర అత్యంత కీలకమైంది. పవన్ లేకపోతే ఎక్కడ పనులు అక్కడ స్థంబించిపోతాయి. ఈ నేపథ్యంలో పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
మార్క్ శంకర్ ని ఇప్పటికిప్పుడు ఇండియాకు తరలించడం సాధ్యమవుతుందా? అంటే అది బిడ్డ ఆరోగ్యం మీద ఆధారపడి ఉటుంది. ఊపిరితిత్తుల్లో గాలి వెళ్లడంతోనే డ్యామేజ్ ఎక్కువగా జరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ సమయంలో విమాన ప్రయాణం సాధ్యమేనా? సౌకర్యంగా ఉంటుందా? లేదా? అన్నది డాక్టర్ల సూచనల మేరకు నిర్ధారించాల్సి ఉంటుంది.
అలాంటి అవకాశం ఉంటే ఉన్నపళంగా హైదరాబాద్ కి షిప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. హైదరాబాద్ లో ఉంటూ ఏపీలో రాజకీయం చేస్తూ కుటుం బంతో ఉండొచ్చు. కానీ మార్క్ శంకర్ చదువు సహా చాలా కాలంగా సింగపూర్ లోనే ఉంటున్నారు. అక్కడ వాతావరణానికి అలవాటు పడి ఉన్నారు. కొత్తగా హైదరాబాద్ కి షిప్ట్ అవ్వడం అంటే వాతావరణం మారు తుంది. సాంకేతికంగానూ కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసు కుంటారో చూడాలి.
