Begin typing your search above and press return to search.

పవన్ లుక్కు మారిందేంటో..?

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్

By:  Tupaki Desk   |   26 July 2023 1:25 PM GMT
పవన్ లుక్కు మారిందేంటో..?
X

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ట్రెండ్ సెట్టర్ అన్న విషయం తెలిసిందే. అప్పటి యూత్ ని ఎంటర్ టైన్ చేస్తూ పవన్ తీసిన సినిమాలన్నీ ఆయనకు బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చేలా చేశాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్, లుక్స్ ఇవన్నీ కూడా చాలా ట్రెండీగా ఉండేవి. అందుకే యువత అంతా పవన్ కళ్యాణ్ ని ఫాలో అయిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా పవన్ తన స్టైలిష్ లుక్స్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాడు. సినిమాల్లోనే కాదు బయట కూడా పవన్ స్టైలిష్ గా ఉండేవారు.

అయితే పవన్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత ఆయన కేవలం సినిమాల్లోనే స్టైల్ గా కనిపిస్తూ వచ్చారు. పబ్లిక్ లో మాత్రం చాలా సింపుల్ గా కనిపిస్తూ వచ్చారు. పవన్ స్టైల్ చూడాలంటే కేవలం సినిమాల్లోనే అన్నట్టుగా ఉంది. అయితే ఈమధ్య పవన్ పూర్తిస్థాయిలో రాజకీయ నేతగా మారిపోయారు. ఏపీలో వరుసగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే క్రమంలో రీసెంట్ గా జరిగిన బ్రో ఈవెంట్ లో పవన్ వైట్ అండ్ వైట్ ఖద్దర్ డ్రెస్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఇదివరకు ఎప్పుడూ పవన్ ఏ సినిమా ఈవెంట్ కి ఇలా వైట్ అండ్ వైట్ డ్రెస్ తో వచ్చింది లేదు. కానీ బ్రో సినిమా ఈవెంట్ కి మాత్రం వైట్ అండ్ వైట్ డ్రెస్ తో షాక్ ఇచ్చారు. అంతేకాదు పవన్ కూడా ఇదివరకు సినిమా ఈవెంట్ లో ఏదో పావుగంట మాట్లాడి వెళ్లిపోయేవాడు. కానీ ఈసారి అర్ధ గంట పాటు మాట్లాడాడు. పొలిటికల్ స్పీచ్ లు ఇచ్చి ఇచ్చి ఏ వేదిక అయినా అలా మాట్లాడుతూనే ఉన్నాడు. అంతేకాదు పవన్ బ్రో ఈవెంట్ స్పీచ్ లో సినిమాలో నటించిన నటీనటులతో పాటుగా క్రూ గురించి కూడా ప్రస్తావించారు.

పవన్ ఇలా తన సినిమాకు పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరి గురించి లిస్ట్ రాసుకుని మరీ చెప్పారు. వైట్ అండ్ వైట్ డ్రెస్ తో పవన్ లుక్స్ అదిరిపోగా ఇక మీదట పవన్ సినిమా ఈవెంట్స్ లో కూడా ఇలానే కనిపిస్తారన్న టాక్ వినిపిస్తుంది. పవన్ పూర్తిస్తాయి రాజకీయ నేతగా మారారు అన్న దానికి ఇదే ఉదాహరణ అని చెప్పొచ్చు. బ్రో సినిమాను సముద్రఖని డైరెక్ట్ చేయగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమాలో పవన్ తో పాటు మేనల్లుడు సాయి తేజ్ కూడా నటించాడు.