Begin typing your search above and press return to search.

కోన వెంకట్ ఇంతలోనే అంత ఛేంజ్ ఎలా బాసూ?

హారర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీ మిక్స్ డ్ టాక్ అందుకుంది.

By:  Tupaki Desk   |   10 July 2024 12:33 PM GMT
కోన వెంకట్ ఇంతలోనే  అంత ఛేంజ్ ఎలా బాసూ?
X

టాలీవుడ్ హిట్ రైటర్ కోన వెంకట్ గురించి అందరికీ తెలిసిందే. తనకు నచ్చని విషయం కోసం ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు. అందుకే ఆయన చేసిన వ్యాఖ్యలు, ఓపెన్ స్టేట్మెంట్లు ఒక్కోసారి వివాదాస్పదంగా మారుతుంటాయి. ఇటీవల తెలుగమ్మాయి అంజలి లీడ్ రోల్ లో నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హారర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీ మిక్స్ డ్ టాక్ అందుకుంది.

అయితే కొన్నేళ్ల క్రితం ఆయన వైసీపీ పార్టీలో చేరిన సంగతి విదితమే. సోషల్ మీడియాలో ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ చేసిన అభివృద్ధి అంటూ పోస్టులు పెట్టారు. అదే సమయంలో ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు సూట్ కావని వ్యాఖ్యలు చేశారు. దీంతో కోన వెంకట్ పై పెద్ద ఎత్తున మండిపడ్డారు పవన్ ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ తో వెంకట్ గా మంచి బాండింగ్ ఉంది.

అనేక సార్లు పవన్ గురించి గొప్పగా, పాజిటివ్ గా మాట్లాడిన కోన్ వెంకట్.. రాజకీయాల్లోకి పవన్ ని వద్దు అని చెప్పాను అని అంటే జనసేనాని ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. దీంతో కోన వెంకట్ పెట్టిన పోస్టులకు ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు. ఇంతలో ఎన్నికలు అయిపోయాయి. పవన్ భారీ మెజార్టీతో గెలవడమే కాకుండా.. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంలో ముఖ్యపాత్ర పోషించారు. దీంతో కోన వెంకట్.. సడెన్ గా యూటర్న్ తీసుకున్నారు!

వైసీపీకి సపోర్ట్ గా ఎప్పుడూ ట్వీట్లు పెట్టే ఆయన.. ఇప్పుడు పవన్ ను ప్రశంసిస్తూ తెగ పోస్టులు పెడుతున్నారు. అసెంబ్లీ ఫలితాలు వచ్చాక.. పవన్ కు విషెస్ చెబుతూ ఓ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు కూడా పోస్టు పెట్టారు. పవన్ కు అది ముఖ్యమైన రోజు అని, ఆయన ఆ స్థానానికి చేరుకోవడానికి 15 ఏళ్లు కష్టపడ్డారని అన్నారు. ఇది లక్షలాది మంది అభిమానులు, స్నేహితుల కల అని తెలిపారు.

రీసెంట్ గా మరో ట్వీట్ చేశారు కోన వెంకట్. పిఠాపురం దశ, ఆంధ్రప్రదేశ్ దిశ కచ్చితంగా మారబోతుందని పోస్ట్ పెట్టారు. చేతివృత్తుల పట్ల పవన్ ఆలోచనలు కచ్చితంగా ఉపాధిని సృష్టిస్తాయని తెలిపారు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా బ్రదర్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆయన ట్వీట్ చూసి నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. జనసేనలో చేరిపోయారా అని అడుగుతున్నారు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా అని గుర్తుచేసుకుంటున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.