Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు కూడా ప‌వ‌న్ హీరోయిన్ ఇలా చేయ‌లేదు

ర‌మ‌ణ అవ‌తార అనే క‌న్న‌డ సినిమాతో పాటు, తంక‌మ‌ణి అనే మ‌ల‌యాళ చిత్రంలోను న‌టిస్తోంది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 3:58 PM GMT
పెళ్లికి ముందు కూడా ప‌వ‌న్ హీరోయిన్ ఇలా చేయ‌లేదు
X

చేప‌క‌ళ్ల ప్ర‌ణీత చాలా కాలంగా సినిమాల‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా పెళ్లి త‌రవాత ఒక బిడ్డ‌కు మామ్ అయిన ప్ర‌ణీత న‌ట‌న‌కు విరామం ఇచ్చింది. 2021లో హంగామా 2, భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాల్లో న‌టించిన ప్ర‌ణీత ఆ త‌ర్వాత మ‌రో రెండు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ర‌మ‌ణ అవ‌తార అనే క‌న్న‌డ సినిమాతో పాటు, తంక‌మ‌ణి అనే మ‌ల‌యాళ చిత్రంలోను న‌టిస్తోంది. ఈ రెండు సినిమాల‌కు సంబంధించిన తాజా అప్ డేట్ రావాల్సి ఉంది.

అయితే సినిమాలు రిలీజ్ కాక‌పోయినా కానీ, ప్ర‌ణీత సోష‌ల్ మీడియాల్లో త‌న అభిమానుల‌కు ట‌చ్ లోనే ఉంది. ఈ వేదిక‌పై నిరంత‌రం వేడెక్కించే స్పెష‌ల్ ఫోటోలు, వీడియోల‌ను షేర్ చేస్తూ అంద‌రినీ యంగేజ్ చేస్తోంది. తాజాగా ప్ర‌ణీత చెల‌రేగిపోయిన ఓ వీడియో ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఈ భామ పెళ్లికి ముందు కూడా ఈ రేంజులో రెచ్చిపోలేదు. ఈ వీడియోలో థై సొగ‌సుల‌ను ఎలివేట్ చేస్తూ ప్ర‌ణీత చేసిన హంగామా మామూలుగా లేదు. వీడియో ఆరంభ‌మే త‌న థై అందాల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు, ఆచ్ఛాద‌న‌గా ఉన్న క్లాథ్ ని తొల‌గించేసింది. అలా క్యాట్ వాక్ చేస్తూ థై ఎలివేష‌న్ కోసం చాలా ప్ర‌య‌త్నించింది.

ఆస‌క్తిక‌రంగా ఈ వీడియోలో ప్ర‌ణీత ఎంతో నేచుర‌ల్ అందంతో మిల‌మిలలాడిపోతోంది. త‌న చేప‌క‌ళ్ల‌ను అటూ ఇటూ తిప్పుతూ సింపుల్ డిజైన‌ర్ థై స్లిట్ ఫ్రాకులో మ‌తులు చెడ‌గొడుతోంది. క్యాట్ వాక్ లో ప్ర‌ణీత మునుప‌టి స్పీడ్ ని ప్ర‌ద‌ర్శించింది. ఈ వీడియోని వీక్షించాక నెటిజ‌నులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. పెళ్లికి ముందు కూడా ప‌వ‌న్ హీరోయిన్ ఇలా చేయ‌లేదు అంటూ కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక `అత్తారింటికి దారేది` త‌ర్వాత తెలుగులో ప్ర‌ణీత‌కు స‌రైన బ్లాక్ బ‌స్ట‌ర్ లేదు. తిరిగి అలాంటి అద్భుత‌మైన చిత్రంతోనే కంబ్యాక్ అవుతుందేమో చూడాలి. అయితే ఇప్పుడు బిడ్డ త‌ల్లి కాబ‌ట్టి క‌థానాయిక‌గా అవకాశాలిస్తారా? అన్నది చూడాలి. క్యారెక్ట‌ర్ న‌టిగా అయితే తెలుగు చిత్ర‌సీమ‌లో అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు. ప్ర‌ణీత ఏం చేస్తుంది? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.