Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ 'వీరమల్లు'.. ఇది పరిస్థితి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సినీ రంగంలో కూడా అతని ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు.

By:  Tupaki Desk   |   30 May 2024 3:57 PM IST
పవన్ కళ్యాణ్ వీరమల్లు.. ఇది పరిస్థితి!
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సినీ రంగంలో కూడా అతని ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. రాజకీయ కార్యకలాపాలు పక్కనబెడితే, పవన్ కళ్యాణ్ సినిమాలపై అభిమానుల్లో ఉన్న ఆసక్తి మామూలు లేదు. తప్పకుండా పవర్ స్టార్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తారని ఎదురుచూస్తున్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో మరోవైపు తమ ప్రాజెక్టులకు పవన్ సమయం కేటాయిస్తాడని సినీ నిర్మాతలు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం మూడు పెద్ద ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి. మొదటగా ‘ఓజీ’ సినిమా సెప్టెంబరు 27న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత పవన్ మరి ఏ ప్రాజెక్టుకు కాల్ షీట్స్ ఇస్తాడన్నది ఆసక్తికరమైన ప్రశ్న.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మరియు ‘హరిహర వీరమల్లు’ చిత్రాలు కూడా పవన్ డేట్స్ కోసం వేచిచూస్తున్నాయి. ఈ రెండు సినిమాలు OG కంటే ముందే ఓకే అయ్యాయి. ఎప్పుడో పూర్తి కావాల్సినవి. ఇక నిర్మాత దర్శకులు సైతం పవన్ కోసం అలా ఎదురుచూస్తూ ఓపికతో ఉండడం విశేషం. ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టు చాలా కాలంగా సెట్స్ పైనే ఉంది.

ఏఎం రత్నం ఈ సినిమా కోసం ఎంతో శ్రమ పడి, ఆర్థిక భారాన్ని మోస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా జనసేన కోసం పవన్ కళ్యాణ్ వ్యాపారపరంగా సహకరించడంతో, ఈ సినిమాపై ఆయన ప్రాధాన్యత మరింత పెరిగింది. రత్నం అయితే, ‘హరిహర వీరమల్లు’కి ఇంకా 25 రోజుల షూటింగ్ మిగిలి ఉందని తెలిపారు. ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన సన్నివేశాలే ఉన్నాయని చెప్పారు.

ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయాలని రత్నం ఉద్దేశించారు. పవన్ ‘ఓజీ’ సినిమాను సెప్టెంబరు చివరలో పూర్తి చేస్తే, ‘హరిహర వీరమల్లు’ సినిమాను కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సాధ్యమవుతుంది. మరోవైపు, పవన్ కళ్యాణ్ తన అభిమానుల కోసం ఇంకా మరిన్ని ప్రాజెక్టులను ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, పవన్ సినిమాలపై అభిమానుల్లో ఉన్న ఆశలు ఏమాత్రం తగ్గడం లేదు. పవన్ ఎంత బిజీగా ఉన్నా కూడా తమ ప్రాజెక్టులకు సమయం కేటాయిస్తారని నిర్మాతలు ఆశపడుతున్నారు. పవన్ రాజకీయ, సినీ రంగాల్లో ఎలాంటి విజయాలు సాధిస్తాడు అనేది రాబోయే రోజుల్లో మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇక మరో రెండు ప్రాజెక్టుల విషయంలో కూడా పవన్ త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.