Begin typing your search above and press return to search.

పవన్‌ కూతురు క్యూట్‌ వీడియో వైరల్‌

తాజాగా మరోసారి తన కూతురు ఆధ్య కు సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

By:  Tupaki Desk   |   23 March 2024 12:50 PM GMT
పవన్‌ కూతురు క్యూట్‌ వీడియో వైరల్‌
X

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా తన పిల్లల గురించిన వీడియోలు మరియు ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన కూతురు ఆధ్య కు సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆద్య పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆద్య యొక్క చిన్నప్పటి వీడియోను షేర్‌ చేసి తన హృదయంలో సగం అయిన ఆద్య కు 14 ఏళ్లు పూర్తి అయ్యాయి అంటూ పోస్ట్‌ పెట్టింది. ఇక వచ్చే నెలతో అకీరా 20 వ ఏట అడుగు పెట్టబోతున్నట్లుగా కూడా రేణు దేశాయ్‌ పేర్కొంది.

సోషల్‌ మీడియాలో రేణు దేశాయ్ షేర్ చేసిన ఆద్య వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. పవన్‌ కళ్యాణ్ కుమార్తె అంటే ఆ మాత్రం ట్రెండ్‌ అవ్వదా... రేణు దేశాయ్ తో విడిపోయినా కూడా పవన్ కళ్యాణ్‌ తన ఇద్దరు పిల్లలను రెగ్యులర్ గా కలవడంతో పాటు వారికి సంబంధించిన అన్ని విషయాలను తానే చూసుకుంటూ ఉంటాడు.

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని మెగా ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు బలంగా కోరుకుంటున్నారు. అతడు హీరో అవ్వడం కోసం ఇప్పటికే వర్కౌట్స్ మొదలు పెట్టాడనే వార్తలు కూడా ఆ మధ్య వచ్చాయి. ఇక పవన్‌ కూతురు ఆద్య ఏం అవ్వాలి అనుకుంటుంది... ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చూడాలి.