ఉస్తాద్ భగత్ సింగ్.. స్పీడ్ పెంచిన పవర్ స్టార్ టీమ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అత్యున్నత బాధ్యతలో కొనసాగుతున్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా సినిమాలకూ సమయం కేటాయిస్తున్నారు.
By: Tupaki Desk | 10 Aug 2025 10:35 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అత్యున్నత బాధ్యతలో కొనసాగుతున్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా సినిమాలకూ సమయం కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఆయన నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను పవర్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు.
ఈ సినిమా కు సంబంధించిన క్లైమాక్స్‌తో పాటు ఒక స్పెషల్ సాంగ్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. లేటెస్ట్ గా చిత్రబృందం ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను షేర్ చేసింది. జూలై 26 తేదీతో ఉన్న క్లాప్‌బోర్డ్ ఫోటోను రిలీజ్ చేస్తూ, ఎడిటింగ్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతోందని ప్రకటించారు. ఈ స్టిల్ పవన్ క్లైమాక్స్ సన్నివేశాల సమయంలో తీసింది. అందులో పవన్ లుక్‌ను పూర్తిగా రివీల్ చేయకపోవడం ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవన్, శ్రీలీలపై చిత్రీకరించిన పాట ఇప్పటికే బృందానికి ప్రత్యేకంగా నచ్చిందని టాక్. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మాస్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అన్ని అంశాలూ ఉంటాయని టీమ్ నమ్మకంగా చెబుతోంది. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తుండటంతో పాటలపై కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రస్తుతం షూటింగ్ దాదాపు పూర్తికావస్తోంది. సెప్టెంబర్‌కి ముందు మొత్తం చిత్రీకరణను పూర్తిచేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రమోషన్లను ఆగ్రెసివ్‌గా ప్రారంభించనున్నారు. ఈ సినిమా పవన్‌కు మాస్ మార్కెట్‌లో మరోసారి బాక్సాఫీస్ దూకుడు తెచ్చిపెడుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.
‘గబ్బర్ సింగ్’ తరహా ఎనర్జీ, పవన్ మార్క్ స్టైల్, హరీష్ శంకర్ పంచ్ డైలాగ్స్ కలిసొచ్చేలా ఈ ప్రాజెక్ట్‌ను తయారు చేస్తున్నారని సమాచారం. ఎడిటింగ్ రూమ్ నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ కూడా చాలా పాజిటివ్‌గా ఉందట. ఇప్పుడు పవర్ స్టార్ అభిమానులంతా థియేటర్లలో ఈ మాస్ ఫీస్ట్ కోసం రోజులు లెక్కపెడుతున్నారు. ఇక నెక్స్ట్ పవన్ OG కూడా లైన్ లో ఉన్న విషయం తెలిసిందే.
