Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్-సూప‌ర్ స్టార్ ఒకేసారి ఎక్కుతారా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` షూటింగ్ రీస్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Jun 2025 5:30 PM
ప‌వ‌ర్ స్టార్-సూప‌ర్ స్టార్ ఒకేసారి ఎక్కుతారా?
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` షూటింగ్ రీస్టార్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డ నుంచి ఆగిందో అక్క‌డ నుంచి మ‌ళ్లీ పున ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా షూటింగ్ కి హాజ‌ర‌వుతున్నాడు. ఆయ‌న‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కె క్కిస్తున్నారు. అయితే త‌దుప‌రి షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారుట‌.

దీనిలో భాగంగా ప‌వ‌న్ విదేశాల‌కు ప్లైట్ ఎక్క‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుతో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధుల సమావేశం కూడా వాయిదా పడిందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ప‌వ‌న్ తిరిగొచ్చిన త‌ర్వాత స‌మావేశ‌మ‌వుతార‌ని తెలుస్తోంది. అయితే పవ‌న్ తో పాటే సూప‌ర్ స్టార్ మ‌హేష్ కూడా విదేశాల‌కు బ‌య‌ల్దేరుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్ప‌టికే ఎస్ ఎస్ ఎంబీ 29 షూటింగ్ విదేశాల్లో జ‌ర‌గాలి. కానీ అనూహ్యంగా హైద‌రాబాద్, ఒడిశాల్లోనే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసారు. ఈ నేప‌థ్యంలో కొత్త షెడ్యూల్ కెన్యాలో మొద‌లు పెట్ట‌డానికి రాజ‌మౌళి స‌ర్వం సిద్దం చేస్తున్నారు. ఇప్ప‌టికే కెన్యా ప్ర‌భుత్వం నుంచి షూటింగ్ కి సంబంధించి అన్ని అనుమతులు కూడా వ‌చ్చేసాయి. ఈ నేప‌థ్యంలోనే వీలైనంత త్వ‌ర‌గా అక్క‌డా షూటింగ్ మొదలు పెట్టాల‌ని రాజ‌మౌళి అండ్ కో రెడీ అవుతుంది.

మ‌రి ఇద్ద‌రి హీరోల్లో ఎవ‌రు ముందు ప్లైట్ ఎక్కుతారో చూడాలి. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ అన్ని ప‌నులు పూర్తి చేసుకుని డిసెంబ‌ర్ లేదా? వ‌చ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవ‌కాశం ఉంది. మ‌హేష్ సినిమా మాత్రం స‌మ యం ప‌డుతుంది. గ్లోబ‌ల్ రేంజ్లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుంన్న‌ది వ‌చ్చే ఏడాది ఆరంభం వ‌ర‌కూ గానీ క్లారిటీ రాదు.