ఒక్క పూట భోజనం.. డైట్ తో పవన్ 10 కిలోల లాస్!
షార్ట్, టీ షర్ట్ తో వచ్చిన పవన్ ను అప్పుడు చూసి అంతా షాకయ్యారు. ఏంటి ఇంత ఫిట్ నెస్ గా ఉన్నారని మాట్లాడుకున్నారు. అయితే డైట్ వల్లే స్లిమ్ అయ్యారని అర్థమవుతుంది.
By: Tupaki Desk | 13 Jun 2025 10:28 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు రాజకీయాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు తనను నమ్ముకున్న నిర్మాతలకు, దర్శకులకు టైమ్ కేటాయిస్తున్నారు. లైనప్ లో ఉన్న సినిమాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం హరిహర వీరమల్లు మూవీని పవన్ పూర్తి చేయగా.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది ఆ చిత్రం. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ మూవీని ఫినిష్ చేశారు పవన్. త్వరలో డబ్బింగ్ వర్క్ ను కంప్లీట్ చేయనున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఫోకస్ పెట్టారు.
రీసెంట్ గా ఆ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టారు. అయితే వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్.. స్పెషల్ డైట్ ను ఫాలో అవుతున్నట్లు సమాచారం. దీంతో 10 కిలోల బరువు తగ్గారని తెలుస్తోంది. కేవలం ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తున్నారట. మిగతా సమయాల్లో స్నాక్స్, బ్లాక్ కాఫీ తీసుకుంటున్నారని టాక్.
ఎక్సర్ సైజెస్ కూడా చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి సీక్రెట్ డైట్ ఫాలో అవుతున్నారు పవన్. రీసెంట్ గా ఆయన ఓ సెలూన్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన విషయం తెలిసిందే. షార్ట్, టీ షర్ట్ తో వచ్చిన పవన్ ను అప్పుడు చూసి అంతా షాకయ్యారు. ఏంటి ఇంత ఫిట్ నెస్ గా ఉన్నారని మాట్లాడుకున్నారు. అయితే డైట్ వల్లే స్లిమ్ అయ్యారని అర్థమవుతుంది.
అంతకుముందు.. కొన్ని నెలల క్రితం ఉత్తరప్రదేశ్ లో జరిగిన కుంభమేళాకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. అప్పుడు ఒంటిపై షర్ట్ లేకుండా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన పొట్ట పెరిగిందని కొందరు నెటిజన్లు ట్రోల్ చేశారు.
నెలలు తిరగకముందే ఇప్పుడు సీన్ కట్ చేస్తే మళ్లీ స్లిమ్ గా దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్.. తన ఫిట్ నెస్ తో ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వన్ టైమ్ మీల్ డైట్ తో తన ఓల్డ్ లుక్ కు వచ్చారు. ఆయన ఇప్పటికే నటించిన తమ్ముడు, ఖుషి సినిమాల్లోని లుక్ లో పవన్ ఇప్పుడు కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
