Begin typing your search above and press return to search.

పవన్ వార్నింగ్ ఇచ్చినా ఉలుకు పలుకు లేదా? కలిసి పుల్ స్టాప్ పెట్టాలి కదా?

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా సినీ ప్రతినిధులపై ఫైర్ అయిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 May 2025 4:21 PM IST
పవన్ వార్నింగ్ ఇచ్చినా ఉలుకు పలుకు లేదా? కలిసి పుల్ స్టాప్ పెట్టాలి కదా?
X

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా సినీ ప్రతినిధులపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా? అని క్వశ్చన్ చేశారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు.. సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందని చెప్పారు.

మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్‌ ను తగిన విధంగానే స్వీకరిస్తానని అన్నారు. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు, చర్చలకు తావు లేదని, సంబంధిత విభాగం ప్రతినిధులతోనే చర్చిస్తానని తెలిపారు. కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాతలు తనను కలిసినప్పుడు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదని చెప్పారు పవన్.

పవన్ ప్రకటనకు ముందే.. థియేటర్స్ ను మూసివేయడం లేదని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. దీంతో ఏపీ డిప్యూటీ సాబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కానీ ఇప్పుడు పవన్ సంచలన ప్రకటన తర్వాత కూడా టాలీవుడ్ సినీ పెద్దల్లో ఉలుకు పలుకు లేదని అర్థమవుతోందని అనేక మంది నెటిజన్లు చెబుతున్నారు.

అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ.. ఆ నలుగురు నియంత్రణలోనే ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అది తప్పు అని నిరూపించడానికి.. నిర్మాతలంతా ఐక్యతగా స్నేహపూర్వకంగా పరిష్కారం కనుగొనడానికి ముందుకు రావాలని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఛాంబర్, నిర్మాతల మండలి సహా పలువురు చర్చించుకోవాలి.

కానీ ఇప్పటి వరకు అలా ఏం జరగలేదు. పవన్ కళ్యాణ్ కార్యాలయం ప్రెస్ నోట్ విడుదలైన వెంటనే నిర్మాతలు నాగ వంశీ, బన్నీ వాస్ తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యారు. ఆ నలుగురులో తాను లేనని తెలిపారు. తాను ఈ మధ్య మీటింగ్స్ కు వెళ్లలేదని కూడా చెప్పారు.

ఇప్పుడు దిల్ రాజు కూడా రెస్పాండ్ అయ్యారు. తమవి 30 థియేటర్స్ మాత్రమేనని తెలిపారు. ఆ నలుగురు.. ఆ నలుగురు అంటున్నారని.. అందుకే క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. వీటన్నిటికీ బదులుగా నిర్మాతలంతా మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి. ఊహాగానాలకు ముగింపు పలకడానికి కలిసి రావాలి. కానీ అనేక మంది సైలెంట్ గానే ఉన్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.