ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పీకే తొలి రిలీజ్!
అయితే పవన్ తొలిసారి ఎమ్మెల్యే గా, డీసీఎంగా మారిన తర్వాత ఆయన కథానాయకుడిగా నటించిన `హరిహర వీమల్లు `చిత్రమే తొలి రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకొస్తుంది.
By: Tupaki Desk | 4 July 2025 12:46 PMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి పిఠాపురం నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలి సిందే. కూటమిగా చంద్రబాబు నాయుడుతో కలిసి బరిలోకి దిగడంతో పవన్ ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ నుంచి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడంతో ఈసారి మాత్రం ఆ ఛాన్స్ తీసుకోకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందు కెళ్లడంతో గెలుపు సాధ్యమైంది.
అయితే పవన్ తొలిసారి ఎమ్మెల్యే గా, డీసీఎంగా మారిన తర్వాత ఆయన కథానాయకుడిగా నటించిన `హరిహర వీమల్లు `చిత్రమే తొలి రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఐదేళ్ల క్రితం మొదలైన ప్రాజెక్ట్ పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చివరిగా ఈనెల 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ఈ చిత్రం పవన్ తొలి పాన్ ఇండియా రిలీజ్ కూడా. ఇంత వరకూ ఆయన పాన్ ఇండియా ప్రయత్నాలు చేయలేదు. కానీ ఆయన క్రేజ్ మాత్రం పాన్ ఇండియాలో ఉంది.
బీజేపీ సన్నిహితుడిగా, సనాతన ధర్మం పరిరక్షకుడిగా ఆయనకు పాన్ ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ సినిమాకు పనికొస్తుందని అంతా భావిస్తున్నారు. భారీ అంచనాల మధ్య వీరమల్లు రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాపై పవన్ పై వ్యతిరేక రాజకీయం ఎలా పనిచేస్తుంది? అన్నది ఆసక్తికరం. రాజకీయం అన్న తర్వాత విమర్శ, ప్రతివిమర్శలు సహజం. కానీ పవన్ రాజకీయ నాయకుడు కంటే ముందు సినిమా నటుడు.
ఈ నేపథ్యంలో పవన్ పై వచ్చిన రాజకీయ విమర్శలు సినిమాపై ఎంత వరకూ ప్రభావాన్ని చూపిస్తాయి? అన్నది ఆసక్తికరం. సినిమా నటుడిగా పవన కళ్యాణ్ ని కోట్లాది మంది అభిమానిస్తారు. కానీ రాజకీయంగా అంత అభిమానం అన్నది రెండు కోణాల్లో ఉంటుంది. ఆయన్ని నాయకుడిగా ఇష్టపడేది కొందరైతే? సినిమా నటుడిగానే అభిమానించేది మరికొంత మంది. రెండు రకాలుగానూ అభిమానించేది ఇంకొంత మంది. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ ఇమేజ్ తగ్గింది అన్నది మరికొంత మంది వాదన. మరి ఇవన్నీ వీరలల్లు పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చూడాలి.