కింగ్డమ్ ప్లేస్ లో వీరమల్లు..?
క్రిష్ మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా నాలుగేళ్ల పైన షూటింగ్ చేశారు. మధ్యలో పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడం వల్ల లేట్ అవుతూ వచ్చింది
By: Tupaki Desk | 4 Jun 2025 1:00 AM ISTక్రిష్ మొదలు పెట్టిన హరి హర వీరమల్లు సినిమా నాలుగేళ్ల పైన షూటింగ్ చేశారు. మధ్యలో పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడం వల్ల లేట్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా జూన్ 12న రిలీజ్ అంటూ హడావిడి చేశారు. కానీ చూస్తే ఇప్పుడు ఆ డేట్ కి కూడా సినిమా రావట్లేదని తెలుస్తుంది. నిర్మాత ఏ ఎం రత్నం మరో డేట్ అది కూడా ఇమీడియట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ జూన్ నెల ఆఖరున కన్నప్ప ఫిక్స్ అయ్యింది. ఆ సినిమా కూడా ఏప్రిల్ నుంచి వాయిదా వేస్తూ ఫైనల్ గా జూన్ 27న రిలీజ్ లాక్ చేసుకున్నారు.
కన్నప్ప రిలీజ్ ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టాడు కాబట్టి ఈసారి వెనక్కి తగ్గేది లేదని తెలుస్తుంది. ఇక జూలై 4న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ రిలీజ్ లాక్ చేశారు. మరి పవన్ సినిమా ఆ డేట్ కి ఏమైనా వస్తుందా అన్న డౌట్ మొదలైంది. పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను జూన్ నుంచి జూలైకి మాత్రమే తప్పితే మరీ ఎక్కువ టైం తీసుకునే ఛాన్స్ లేదు. అసలు ఆ సినిమా రిలీజ్ అవ్వకుండా ఉండటానికి ఏవేవో కారణాలు అవుతున్నాయి.
ఐతే జూలై 4న వీరమల్లు రావడం కన్ ఫర్మ్ ఐతే మాత్రం దేవరకొండ హీరో సైడ్ ఇవ్వాల్సిందే. అసలే సితార బ్యానర్ తో పవన్ కళ్యాణ్ కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో పవన్ వస్తే విజయ్ దేవరకొండ తప్పుకుంటాడు. కింగ్ డమ్ కూడా అసలైతే మే 30న రావాలని అనుకున్నాడు కానీ అది కాస్త వాయిదా పడక తప్పలేదు. మరి విజయ్ దేవరకొండ సినిమాకు కూడా ఈ రిలీజ్ వాయిదాల ఎఫెక్ట్ పడేలా ఉంది.
పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా జూలై 4 నుంచి ఇంకా దూరంగా వెళ్తే మాత్రం ఇక ఆ సినిమా మీద ఫ్యాన్స్ కాస్త డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. జూన్ 12 వస్తుందని సాంగ్స్ కూడా రిలీజ్ చేసిన మేకర్స్ సడెన్ గా వాయిదా అంటూ కొన్ని వార్తలు రావడం పవర్ స్టార్ ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. మరి వీరమల్లు రిలీజ్ మోక్షం ఎప్పుడు అసలు ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారటూ ఆడియన్స్ అడుగుతున్నారు.
