పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' లో దశావతారం..?
పవన్ కళ్యాణ్ ఈ వారం 'హరి హర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత మూడు నాలుగు ఏళ్లుగా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 20 July 2025 4:00 PM ISTపవన్ కళ్యాణ్ ఈ వారం 'హరి హర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గత మూడు నాలుగు ఏళ్లుగా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. రెండేళ్ల క్రితం రావాల్సిన ఈ సినిమా పవన్ బిజీగా ఉండటం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా విడుదల కాబోతుంది. వీరమల్లు సినిమాతో పాటు సాహో దర్శకుడి దర్శకత్వంలో ఓజీ సినిమాను మొదలు పెట్టాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయింది. సెప్టెంబర్ నెలలో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలతో పాటు చాలా కాలం క్రితమే హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమాను అనుకున్నారు. అప్పట్లో కొన్ని సీన్స్ చేశారు. కానీ పవన్ బిజీగా ఉండటంతో సినిమా క్యాన్సల్ అయిందనే వార్తలు వచ్చాయి.
నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఇప్పటికే ఒక షెడ్యూల్ కోసం డేట్లు ఇచ్చాడు. ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తున్న విషయం తెల్సిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా రాశి ఖన్నా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. రాశి ఖన్నాకు సంబంధించిన షూటింగ్ త్వరలో జరగబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు అయిన కేఎస్ రవికుమార్ ను సంప్రదించారనే వార్తలు వస్తున్నాయి.
ఈమధ్య కాలంలో కేఎస్ రవికుమార్ దర్శకుడిగా కంటే నటుడిగా సినిమాలు ఎక్కువ చేస్తున్నాడు. గత ఏడాది ఈయన నటించిన ఆరు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఈయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. తనకే సాధ్యం అనిపించే విధంగా ఈయన కొన్ని పాత్రలను చేస్తున్నాడు. అందుకే ఈయనకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ముందు ముందు కూడా మరిన్ని సినిమాలు చేసే ఉద్దేశంతో ఉన్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈయన చెప్పుకొచ్చాడు. కేఎస్ రవికుమార్ తెలుగులో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమా చాలా స్పెషల్ అన్నట్లుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మూవీలో చిన్న పాత్ర అయినా పెద్ద గుర్తింపు లభిస్తుంది.
దర్శకుడిగా దశావతారం వంటి పెద్ద సినిమాలను రూపొందించిన ఈ దర్శకుడు ఈ మధ్య కాలంలో దర్శకత్వంపై ఆసక్తి కనబర్చడం లేదు. 2019లో చివరి సారి కేఎస్ రవికుమార్ దర్శకుడిగా వచ్చాడు. అప్పటి నుంచి నటుడిగానే సినిమాలు చేస్తున్నాడు. విలన్ పాత్రలకు, సీరియస్ పాత్రలకు ఈ దశావతారం దర్శకుడు మోస్ట్ వాంటెడ్‌గా నిలుస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఈయన నటించడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా తమిళ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి, అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నటుడి ఎంపిక గురించి దర్శకుడు హరీష్ శంకర్ నుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని మీడియా వర్గాల వారు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
