ఉస్తాద్ భగత్ సింగ్ రెండు నెలల్లో ముగించాల్సిందే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `హరిహర వీరమల్లు` పూర్తి చేసిన పీకే ఓజీ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 6:20 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `హరిహర వీరమల్లు` పూర్తి చేసిన పీకే ఓజీ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరికొన్ని రోజుల్లోనే ఆ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. అటుపై పవన్ `ఉస్తాద్ భగత్ సింగ్` ని పట్టాలెక్కించనున్నారు. ఈ సినిమా ప్రారంభమైన అనంతరం పవన్ పై కొంత పార్ట్ షూటింగ్ కూడా చేసారు. ఆ తర్వాత ఆగిపోయింది.
అయితే జూన్ రెండో వారం నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామని దర్శకుడు హరీష్ శంకర్ ప్రకటించాడు. దీంతో టీమ్ అందుకు సర్వం సిద్దం చేస్తోంది. ఇప్పటికే అసరమైన సెట్ పనులు జరుగుతున్నాయి. `ఓజీ` నుంచి రిలీవ్ అవ్వగానే ఉస్తాద్ మొదలవుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం రెండు నెలల్లోనే పూర్తి చేసే ప్రణాళికతో హీరీష్ శంకర్ ముందుకెళ్తున్నాడు. షూటింగ్ పేరుతో ఎక్కువ సమయం వృదాకా కుండా ఎంత వీలైత అంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ కూడా నిర్మాతపై భారం పడకుండా తాను తీసుకోవాల్సిన వ్యక్తిగత చర్యలు తీసుకుం టున్నారు. తన కారణంగా షూటింగ్ లు డిలే అవ్వడంతో పారితోషికాల్లో కోత విధించడం..ఇంకా అవసరం అనుకుంటే తీసుకున్నది తిరిగి ఇచ్చేయడం వంటి చర్యలకు ఉపక్రమించారు. అయితే `ఉస్తాద్ భగత్ సింగ్` కి అలాంటి ఆఫర్ ఇచ్చారా? లేదా? అన్నది తెలియదు. `ఓజీ`, `వీరమల్లు `విషయంలో మాత్రం దండీగా ఇలాంటి ఆఫర్లు కనిపించాయి.
ఉస్తాద్ భగత్ సంగతి చూస్తే? రెండు నెలల్లో గనుక షూటింగ్ పూర్తి చేస్తే ఇదే ఏడాది ఈ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ పేరు టాలీవుడ్ హిస్టరీలో నమోదవుతుంది. ఎందుకంటే ఇంతవరకూ ఆయన నటించిన సినిమాలేవి ఒకే ఏడాది రెండు.. మూడు రిలీజ్ అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఏడాదికి ఒకటి రిలీజ్ చేయడమే కష్టం. అలాంటి పీకే నుంచి ఒకే ఏడాది మూడు రిలీజ్ అయితే అభిమానుల ఆనందానికి అవధులుండవ్.
