పవన్ 'ఉస్తాద్'.. అప్పుడే కంప్లీట్ అయిపోయిందా?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 July 2025 12:31 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో సినిమా రానుండడంతో ఆడియన్స్ తోపాటు పవన్ అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఓవైపు రాజకీయాల్లో తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తూనే.. మరోవైపు ఇప్పటికే అంగీకరించిన సినిమాలు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు పవన్. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ సినిమా షూటింగ్ లను పవన్ పూర్తి చేశారు. అందులో వీరమల్లు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. ఓజీ మరికొద్ది నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల క్రితం సెట్స్ లోకి ఆయన అడుగుపెట్టినట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. పవన్ తోపాటు ఇతర కీలక పాత్రధారులు షూటింగ్ కు హాజరైనట్లు తెలిపారు. ఇప్పుడు పవన్ పెండింగ్ పెట్టిన ప్రాజెక్టుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం మిగిలి ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా ఆ సినిమా గురించి పవన్ ఇచ్చిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉస్తాద్ షూట్ తో పాటు రిలీజ్ డేట్ పై మాట్లాడారు. ఉస్తాద్ షూటింగ్ శరవేగంగా జరుగుతుందని.. తన పార్ట్‌కు సంబంధించిన చిత్రీకరణ ఐదారు రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయిపోతున్నారు.
అప్పుడే పవన్ కళ్యాణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందా అని ఆశ్చర్యానికి లోనవుతున్నారు. అయితే వరుస కాల్ షీట్స్ ఇవ్వడంతో హరీష్ శంకర్.. జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో సినిమా.. డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవుతుందని కూడా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు.
ఇప్పుడు ఆ విషయం కూడా వైరల్ గా మారింది. ఎందుకంటే ఇప్పుడు జులైలో వీరమల్లు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడికి కరెక్ట్ గా రెండు నెలల తర్వాత దసరా కానుకగా ఓజీ సినిమా సందడి చేయనుంది. పవన్ ప్రకటన ప్రకారం.. ఓజీ రిలీజ్ అయిన మూడు నెలలకే ఉస్తాద్ భగత్ సింగ్ రానుంది. మరి ఆ సినిమా.. ఎప్పుడు థియేటర్స్ లో విడుదల అవుతుందో వేచి చూడాలి.
