ఉస్తాద్ కూడా లైన్ లోకి వచ్చినట్లే..
తాజాగా విడుదలైన పోస్టర్ పవన్ మాస్ ఇమేజ్‌కు చక్కటి ప్రతిరూపంగా నిలిచింది. రెండు చేతులు కలిపే స్టైల్, డైనమిక్ డిజైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ మాస్ హైప్‌ను మళ్లీ రెట్టింపు చేసింది.
By: Tupaki Desk | 22 May 2025 9:29 AMపవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాల మీద తన ఫ్రీక్వెన్సీ తగ్గించని పవన్, ఇప్పుడు మరోసారి కెమెరా ముందుకు వస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తరవాత హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా షూటింగ్ జూన్ నుండి మళ్లీ ప్రారంభం కానుంది. ఈ సినిమా ఇప్పటికే టైటిల్, లుక్ పోస్టర్లతో మాస్ ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేసింది.
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది మంచి గుడ్ న్యూస్. షూటింగ్ ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులకు, జూన్ షెడ్యూల్‌తో ఈ సినిమా మళ్లీ హై స్పీడ్‌లో వెళ్తుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్ పవన్ మాస్ ఇమేజ్‌కు చక్కటి ప్రతిరూపంగా నిలిచింది. రెండు చేతులు కలిపే స్టైల్, డైనమిక్ డిజైన్‌తో విడుదలైన ఈ పోస్టర్ మాస్ హైప్‌ను మళ్లీ రెట్టింపు చేసింది.
ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, సంగీతాన్ని రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తరవాత మళ్లీ పవన్ – డీఎస్పీ కాంబోకి ఓ బ్లాస్టింగ్ మాస్ ఆల్బమ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పవన్ స్టైల్‌కు తగినట్లు స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు సమాచారం. పవన్ రాజకీయ స్థాయిలో ప్రజలతో కలిసే మార్గం, ఆయన నమ్మకాలు.. వీటికి తగ్గట్లు కథ రూపొందించారని బజ్ ఉంది.
ఓ భారీ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరపై వచ్చేందుకు సిద్దమవుతోంది. హరీష్ శంకర్ కూడా మళ్లీ తన మార్క్ డైలాగ్ రైటింగ్‌తో పవన్ అభిమానులకు బాక్సాఫీస్ పండగ చూపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తిచేసి విడుదల చేసేందుకు మేకర్స్ స్పీడ్ పెంచుతున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలు పొలిటికల్ డీలేలకు గురవుతున్న సందర్భంలో, 'ఉస్తాద్ భగత్ సింగ్' షూట్ రీస్టార్ట్ అవుతుండటం అభిమానుల లోని నిరాశను తొలగించింది.
జూన్ షెడ్యూల్లో పవన్ పూర్తి డేట్స్ ఇవ్వనుండటంతో కథనం మెరుగ్గా ప్రోగ్రెస్ అవుతుందనడం ఖాయం. ఇక పవన్ – హరీష్ కాంబో బలం ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ మరోవైపు OG సినిమాకు కూడా ఫీనిషింగ్ టచ్ ఇస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో వచ్చే అవకాశం ఉంది.