పవన్‌కు అంత ఇస్తున్నారా.. మరీ టూమచ్ గురూ!
రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు.
By: Tupaki Desk | 27 April 2025 12:00 AM ISTపవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ గత కొంత కాలంగా క్రీయాశీల రాజకీయాల్లో యాక్టీవ్‌గా ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ, బిజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేయడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తెలిసిందే. జనసేన పోటీచేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించడంతో పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి తనదైన పంథాలో దూసుకుపోతున్నారు.
రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆయన సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. పవన్ కల్యాణ్ రాజ.కీయాల్లో యాక్టీవ్ కావడానికి ముందు పలు క్రేజీ ప్రాజెక్ట్‌లని అంగీకరించారు. అందులో కొన్ని సెట్స్ పై ఉన్నాయి. కొన్ని పూర్తియ రిలీజ్‌కు రెడీ అవుతుంటే మరి కొన్ని షూటింగ్ దశలోనే పవన్ డేట్స్ లభించక ఆగిపోయాయి. క్రిష్ డైరెక్షన్‌లో పవన్ నటించిన పీరియాడిక్ డ్రామా `హరి హర వీరమల్లు`. దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
ఫస్ట్ పార్ట్‌కు క్రిష్ దర్శకత్వం వహించగా, సెకండ్ పార్ట్‌కు ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దీని షూటింగ్ జరగాల్సి వుంది. దీనికితోడు పవన్ అంగీకరించిన మరో రెండు సినిమాలు `ఓజీ`, ఉస్తాద్ భగత్‌సింగ్. హరీష్ శంకర్ `ఉస్తాద్ భగత్‌సింగ్`ని తెరకెక్కిస్తున్నాడు. దీని షూటింగ్ జరగాల్సి వుంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని, పవన్ డేట్స్ కేటాయించకపోవడం వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో క్రేజీ రూమర్ చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ షూటింగ్ ఆగిపోలేదన్నది వాస్తవం. పవన్ డేట్స్ కేటాయించడంపైనే ఈ మూవీ షూటింగ్ ఆధారపడిఉంది. అయితే ఈ సినిమాకు పవన్ ఏకంగా రూ.170 కోట్లు పారితోషికం తీసుకుంటున్నారని, వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ షూటింగ్ కోసం పవన్ డేట్స్ కేటాయిస్తారని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ న్యూస్ చూసిన పవన్ ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు. సినిమా బడ్జెటే వంద కోట్లు కానప్పుడు సినిమాకు పవన్ రూ.170 కోట్లు పారితోషికం ఎలా తీసుకుంటాడని,మరీ ఇది టూమచ్ గురూ అంటూ వాపోతున్నారు.
