పవన్ ఆ సినిమాను డైరెక్ట్ చేసి ఉంటే నెక్ట్స్ లెవెలే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. తెలుగు రాష్ట్రాల్లో హీరోగా ఆయనకున్న ఫాలోయింగ్ ను ఊహించడం కూడా చాలా కష్టం.
By: Tupaki Desk | 6 May 2025 5:55 AMపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. తెలుగు రాష్ట్రాల్లో హీరోగా ఆయనకున్న ఫాలోయింగ్ ను ఊహించడం కూడా చాలా కష్టం. ఆయన్నుంచి సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసే హంగామా, ఆ కలెక్షన్లు ఇలా ప్రతీదీ సెన్సేషనే అవుతుంది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లోకి వచ్చి బిజీగా ఉన్నారు కానీ గతంలో ఆయన హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా సినిమా చేశారు.
పవన్ కళ్యాణ్ కు హీరోగానే కాకుండా ఎన్నో అంశాల్లో చాలా మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్స్ లో డైరెక్షన్ కూడా ఒకటి. పవన్ దర్శకత్వంలో ఆల్రెడీ గతంలో జానీ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ దర్శకత్వంలో సినిమా రావడంతో ఆ సినిమా అప్పట్లో భారీ క్రేజ్ తో ఎన్నో అంచనాలతో రిలీజైంది. ఇప్పటికీ ఆ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు.
అయితో భారీ అంచనాలతో వచ్చిన జానీ అనుకున్న స్థాయిలో హిట్ అవలేదు కానీ ఆ సినిమాను ఇప్పుడు రీరిలీజ్ చేస్తే మాత్రం మంచి కలెక్షన్స్ దక్కే అవకాశముంది. జానీ తర్వాత పవన్ మళ్లీ ఏ సినిమాకూ దర్శకత్వం వహించింది లేదు. బాబీ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ కు కథ, స్క్రీన్ ప్లే అందించారు కానీ డైరెక్షన్ అయితే ఆయన చేయలేదు.
ఇదిలా ఉంటే పవన్ దర్శకత్వం గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ విషయం తెలుస్తోంది. జానీ సినిమాకు దర్శకత్వం వహించిన టైమ్ లోనే పవన్ మరో మరో సినిమాను కూడా డైరెక్ట్ చేద్దామనుకున్నారట. అడవి మృగాల బ్యాక్ డ్రాప్ లో పవన్ ఆ సినిమాను ప్లాన్ చేసుకున్నారని, దానికోసం నిజమైన జంతువులనే తీసుకుని వాటితోనే షూటింగ్ చేయాలని కూడా అనుకున్నారట.
అందుకోసం పవన్ కొన్ని పులి పిల్లలు, ఇతర జంతువులపై పరిశోధన కూడా చేశారని, కానీ ఆ సినిమా అలా ఆగిపోయిందని అప్పట్లో రేణూ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపోయారు. నిజంగా పవన్ అనుకున్న కాన్సెప్ట్ తో ఆ టైమ్ లోనే సినిమా వచ్చి ఉంటే అదొక ట్రెండ్ సెట్టర్ మూవీగా మిగిలేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.