రాజకీయ రొచ్చులో ఇండస్ట్రీ.. ఆయన్ను ఇరిటేట్ చేశామంటే..!
పాలిటిక్స్ సినిమా రెండు వేరు వేరైనా ఎక్కడో ఒక చిన్న లైన్ ఈ రెండిటినీ కలుపుతుంది.
By: Tupaki Desk | 24 May 2025 6:33 PMపాలిటిక్స్ సినిమా రెండు వేరు వేరైనా ఎక్కడో ఒక చిన్న లైన్ ఈ రెండిటినీ కలుపుతుంది. రాజకీయాలు, పార్టీలతో సంబంధం లేకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమని నడిపించాలని చూస్తున్నారు. కానీ అది జరిగే పని అనిపించట్లేదు. ఐతే రెండు రాష్ట్ర ప్రభుత్వాలను సినీ పెద్దలు కలవడం పరిశ్రమకు కావాల్సిన సహాయ సహకారాలు పొందడం అన్నది కామనే. ఐతే ఏపీలో కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం టాలీవుడ్ కి సపోర్ట్ గా ఉంటుంది.
తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సినిమా వాళ్లకు సపోర్ట్ గా ఉంటాం వాళ్లు ప్రభుత్వానికి సహకారం అందించాలని చెప్పారు. ఐతే సినీ హీరోగా చేస్తూ ఏపీకి డిప్యూటీ సీఎంగా ఎంపికైన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా టాలీవుడ్ పై అసంతృప్తిని వెలిబుచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది కావొస్తున్నా పరిశ్రమ నుంచి ఎలాంటి ఇన్షియేషన్ లేదన్నట్టుగా మాట్లాడారు. అంతేకాదు వ్యక్తులు కాదు అందరు కలిసి రావాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఈ వ్యాఖ్యల పట్ల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చర్చ మొదలైంది. తెలుగు హీరో అయ్యుండి పవన్ టాలీవుడ్ పై ఇలా స్పందించడం ఏంటని అనుకుంటున్నారు. ఐతే దీనిపై నిర్మాత బన్నీ వాసు స్పందించారు. సినిమా పరిశ్రమలో రాజకీయాలు చాలా సైలెంట్ గా.. లోతుగా ఉంటాయని అన్నారు. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అన్న విషయాన్ని ఇప్పటికైనా నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు గ్రహించాలి. సినిమా పరిశ్రమ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వాళ్లనే మనం ఇరిటేట్ చేశామంటే మన యూనిటీ ఎలా ఉందో ప్రశ్నించుకోవాలని బన్నీ వాసు స్పందించారు.
బన్నీ వాసు స్పందనపై మిగతా పరిశ్రమ వ్యక్తులు ఎలా రెస్పాండ్ అవుతారన్నది చూడాలి. నిజంగానే పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై టాలీవుడ్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. టికెట్లు రేట్లు పెంచుకోవడం కోసమే విడివిడిగా వచ్చి కలవడం తప్ప ఒకటిగా అందరు కలిసి ఎందుకు రావట్లేదు అన్న విధంగా పవన్ మాట్లాడటం టాలీవుడ్ లో ఉన్న రాజకీయ కోణాలను బహిర్గతం చేసేలా ఉన్నాయి. మరి ఈ ఇష్యూపై మిగతా సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అన్నది చూడాలి.