పవర్ స్టార్ తో సముద్రఖని సోలో లోడింగ్!
పవన్ కళ్యాణ్ నటుడు కం డైరెక్టర్ సముద్రఖనికి కూడా ఓ కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jun 2025 6:35 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చకాచకా పెండింగ్ షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 'హరిహర వీరమల్లు', 'ఓజీ' షూటింగ్లు పూర్తి చేసి పంపించాడు. ఇటీవలే 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని కూడా పట్టాలెక్కించారు. ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి పవన్ మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ చిత్రం షూటింగ్ కూడా రెండు నెలల్లో చుట్టేస్తారు. అదే ప్రణాళికతో హరీష్ శంకర్ ముందుకెళ్తున్నాడు.
అన్ని అనుకున్నట్లు జరిగితే ఇదే ఏడాది 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా రిలీజ్ అవుతుంది. పవన్ పేరిట ఒకే ఏడాది మూడు చిత్రాలు రిలీజ్ చేసిన హీరోగా స్టార్ హీరోల చరిత్రలోనూ నిలిచిపోతాడు. ఈ మూడు సిని మాలు రిలీజ్ అయితే పవన్ కమిట్ అయిన చిత్రాల జాబితా కూడా పూర్తవుతుంది. మరి అటుపై పవన్ డిప్యూటి సీఎం పదవికే పరిమితవుతారా? అంటే నో ఛాన్స్ అన్నట్లే కనిపిస్తుంది సన్నివేశం.
పవన్ కళ్యాణ్ నటుడు కం డైరెక్టర్ సముద్రఖనికి కూడా ఓ కమిట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అత డితో ఓ సినిమా చేస్తానని గతంలో ప్రకటించారు. అయితే అది ఇంతవరకూ ప్రకటనగానే కనిపించింది. తాజా గా ఆ చిత్రాన్ని కూడా పీకే లోడ్ చేస్తున్నాడు. పవన్ అండ్ సముద్రఖని కాంబినేషన్ లోడింగ్ అంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది. అన్ని అనుకున్నట్లు జరిగితే గనుక వచ్చే ఏడాది ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇప్పటికే సముద్రఖనితో పవన్ కళ్యాణ్ 'బ్రో' సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే అందులో పవన్ కళ్యాణ్ హీరో కాదు. ఆయన మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హీరోగా నటించాడు. మేనల్లుడు కోసం అందులో దైవం పాత్ర పోషించాడు. ఆ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. కానీ మేకర్ గా సముద్రఖని కి మంచి పేరొ చ్చింది. ఆ సమయంలో ఇద్దరు కలిసి పనిచేయాలనుకున్నారు. కానీ సీరియస్ గా దృష్టి పెట్టలేదు. అది ఇప్పుడు సాధ్యమవుతుంది.
