తొలి ప్రేమ మూవీ సీక్రెట్… పవన్ కళ్యాణ్ నిజాయితీకి ఇదే నిదర్శనం!
అప్పుడు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సాయి ఇంకా ఇండస్ట్రీకి కొత్త. అంత ఖరీదైన సెట్ బాధ్యతను ఒక కొత్త వ్యక్తికి అప్పగించడానికి నిర్మాతలు మొదట వెనుకాడారు.
By: Madhu Reddy | 18 March 2026 3:00 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లాసిక్ హిట్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే సినిమా 'తొలిప్రేమ'. 1998లో విడుదలైన ఈ చిత్రం ఆయనను స్టార్‌గా మార్చడమే కాకుండా, ఎన్నో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. తన స్నేహితుడి కోసం, సినిమా క్వాలిటీ కోసం పవన్ కళ్యాణ్ తన పారితోషికాన్ని సైతం రిస్క్‌లో పెట్టారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో చూద్దాం.
పారితోషికంతో సమానమైన తాజ్ మహల్ సెట్:
కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో 'తాజ్ మహల్' సెట్ ఒక ప్రధాన ఆకర్షణ. అందులో ఓ పాట మొత్తం ఆ సెట్ లోనే జరుగుతుంది. ఇక సముద్రతీరంలో వేసిన ఈ సెట్ కోసం అప్పట్లోనే నిర్మాతలు ఏకంగా రూ.12 లక్షలు ఖర్చు చేశారు. విశేషం ఏమిటంటే, ఈ సినిమా కోసం హీరో పవన్ కళ్యాణ్‌కు అందిన రెమ్యూనరేషన్ కూడా సరిగ్గా రూ. 12 లక్షలే, అంటే ఒక హీరో పారితోషికంతో సమానంగా కేవలం ఒక సెట్ కోసమే ఖర్చు చేయడం ఆ రోజుల్లో ఒక సాహసమనే చెప్పాలి. ఈ సెట్ సినిమా విజయంలో ఎంతటి కీలక పాత్ర పోషించిందో మనందరికీ తెలిసిందే.
స్నేహం కోసం పవన్ కళ్యాణ్ రిస్క్:
అప్పుడు ఆర్ట్ డైరెక్టర్‌గా ఆనంద్ సాయి ఇంకా ఇండస్ట్రీకి కొత్త. అంత ఖరీదైన సెట్ బాధ్యతను ఒక కొత్త వ్యక్తికి అప్పగించడానికి నిర్మాతలు మొదట వెనుకాడారు. కానీ పవన్ కళ్యాణ్ తన స్నేహితుడైన ఆనంద్ సాయి టాలెంట్‌ను నమ్మారు. నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో పవన్ ఒక అడుగు ముందుకేసి.. ఒకవేళ ఆ సెట్ కనుక అనుకున్నట్టుగా రాకపోతే, తన పారితోషికాన్ని వదులుకుంటానని నిర్మాతలకు హామీ ఇచ్చారు. తన కెరీర్ ఆరంభంలోనే పవన్ చూపించిన ఈ తెగింపు అందరినీ ఆశ్చర్యపరిచింది.
నిజాయితీ మరియు బలమైన బంధం:
ఈ సంఘటన పవన్ కళ్యాణ్ మరియు ఆనంద్ సాయి మధ్య ఉన్న గాఢమైన స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది. కేవలం స్నేహం మాత్రమే కాదు, తన వృత్తి పట్ల ఆయనకు ఉన్న నిజాయితీకి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఆనంద్ సాయి కష్టపడి ఆ తాజ్ మహల్ సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ సెట్ చూశాక నిర్మాతలు కూడా ఫిదా అయిపోయారు. అలా పవన్ కళ్యాణ్ నమ్మకం నిజమైంది, ఆనంద్ సాయి టాప్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఎదిగారు. నేటికీ వీరిద్దరి బంధం టాలీవుడ్‌లో ఇప్పటికి ప్రత్యేకమే.
సింపుల్ లవ్ స్టోరీ, క్యూట్ ఎమోషన్స్, అదిరిపోయే సాంగ్స్‌తో 'తొలిప్రేమ' జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. సినిమా వెనుక ఇలాంటి నిజాయితీతో కూడిన ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టే, అది దశాబ్దాలు గడిచినా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. పవన్ కళ్యాణ్ తన కెరీర్ తొలి రోజుల నుంచే విలువలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఈ తాజ్ మహల్ సెట్ ఉదంతం మరోసారి నిరూపించింది. అంకితభావంతో చేసే పని ఎప్పుడూ ఫెయిల్ అవ్వదని ఈ విషయం ద్వార రుజువైనది.
