Begin typing your search above and press return to search.

రాజకీయాల్లోకి వచ్చాక.. స్టోరీలు చెప్పడం మానేశారు: పవన్

తాను రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాలు చేద్దామనుకున్నానని తెలిపారు. తనకు అదొక ఎక్స్పీరియన్స్ అని, తానెప్పుడూ బిగ్ స్టార్ అని చెప్పుకోలేదని అన్నారు.

By:  Tupaki Desk   |   23 July 2025 9:40 PM IST
రాజకీయాల్లోకి వచ్చాక.. స్టోరీలు చెప్పడం మానేశారు: పవన్
X

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. నెవ్వర్ బిఫోర్ అనేలా వీరమల్లు విషయంలో ప్రమోషన్స్ తో సందడి చేశారు. ఆ సమయంలో భవిష్యత్ ప్రణాళికలు, కెరీర్ గురించి అన్ని విషయాలు షేర్ చేసుకున్నారు.

అయితే సుమారు పదేళ్ల క్రితం పవన్ రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత వివిధ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, వకీల్ సాబ్, అజ్ఞాతవాసి, భీమ్లా నాయక్ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేశారు.

తాను రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాలు చేద్దామనుకున్నానని తెలిపారు. తనకు అదొక ఎక్స్పీరియన్స్ అని, తానెప్పుడూ బిగ్ స్టార్ అని చెప్పుకోలేదని అన్నారు. కానీ పొలిటిక్స్ లోకి వచ్చాక సినిమాలు చేసేందుకు సిద్ధమైనా.. స్టోరీస్ చెప్పడం మానేశారని చెప్పారు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండడం వల్ల నమ్మలేదని అన్నారు.

అందుకు తనకు స్టోరీస్ చెప్పేందుకు రాలేదని, వాళ్ల సినిమాల్లో భాగం చేసుకోలేదని పేర్కొన్నారు. తాను ఎంతలా సపోర్ట్ చేసిన వ్యక్తులు తన సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వలేదని చెప్పారు. రాజకీయాల్లోకి రావడం వల్ల అలా మూల్యం చెల్లించుకున్నానని అన్నారు. ప్రస్తుతం పవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరో ఇంటర్వ్యూలో.. సినిమాలు కంటే తనకు రాజకీయాలు ముఖ్యమని పవన్ తెలిపారు. అలా అని సినిమాలపై ప్రేమ తగ్గదని చెప్పారు. నిర్మాతలకు ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో షూటింగ్‌ లకు డేట్స్ ఇచ్చానని పేర్కొన్నారు. ఉస్తాద్ భగత్‌ సింగ్ మూవీ పూర్తయిన తర్వాత పూర్తిగా రాజకీయాల్లో బిజీ అయిపోతానని తెలిపారు.

ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించామని, అందువల్ల ఇకపై తాను సినిమాల్లో నటించే అవకాశం పెద్దగా ఉండకపోవచ్చని చెప్పారు. నిర్మాతగా మారి సినిమాలు నిర్మించే ఆలోచన ఉందని చెప్పారు. సినిమాల్లో నటించాలంటే కనీసం రెండు మూడేళ్లు పడుతుందని, అంత టైమ్ అసలు కేటాయించలేనని క్లారిటీ ఇచ్చారు.