సురేందర్ రెడ్డితో పవన్ సినిమా సంగతేంటి? జరిగే పనేనా?
అయితే మూడు సినిమాలు అయ్యాక.. పవన్ కొత్త చిత్రాలను ఒప్పుకుంటారా? నటిస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్.
By: Tupaki Desk | 16 Jun 2025 1:00 AM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. కొద్ది రోజులుగా తాను ఇప్పటికే సైన్ చేసిన సినిమాలు చకచకా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత హరిహర వీరమల్లు మూవీని పూర్తి చేసిన పవన్.. ఆ వెంటనే ఓజీని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా.
అయితే మూడు సినిమాలు అయ్యాక.. పవన్ కొత్త చిత్రాలను ఒప్పుకుంటారా? నటిస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకు ఆ విషయంపై పవర్ స్టార్ ఎక్కడా స్పందించలేదు.. ఎలాంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. కానీ సముద్రఖని దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తారని మాత్రం కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
అదే జరిగితే సినీ ప్రియులకు ఆనందమే. కానీ జరుగుతుందో లేదో తెలియదు. అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్ కు వెళ్తే.. 2023లో దర్శకుడు సురేందర్ రెడ్డి.. పవన్ తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ ప్రాజెక్టుకు రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. పూజా కార్యక్రమాలు కూడా చేశారు. కానీ సినిమా మాత్రం స్టార్ట్ అవ్వలేదు.
ఆ తర్వాత ఓసారి నిర్మాత స్పందించి.. పవన్ కు సురేందర్ రెడ్డి స్క్రిప్ట్ బాగా నచ్చిందని చెప్పారు. కానీ సినిమా తీసేందుకు సమయం లేకపోవడం బాధాకరమన్నారు. ఇచ్చిన అడ్వాన్స్ ను వెనక్కి తీసుకోలేదని తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లి బిజీగా మారిన పవన్.. వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ నే పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు.
దీంతో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ మరి స్టార్ట్ అవ్వలేదు. అలా ఆ సినిమా రద్దు అవుతుందని అంతా అనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి మాత్రం ఆశతో ఉన్నారని ఇప్పుడు తెలుస్తోంది. నిర్మాత రామ్ తాళ్లూరి, పవన్ సాన్నిహిత్యంగా ఉంటారు కాబట్టి.. తన మూవీని పవర్ మొదలుపెడతారని ఆయన అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ రాబోయే కొన్ని నెలల్లో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను పూర్తి చేసి, తన ప్రాజెక్ట్ కోసం తేదీలు కేటాయించాలని సురేందర్ రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఉస్తాద్ షూటింగ్ ఎక్కువే ఉంది. ఓజీ డబ్బింగ్ ఇంకా పెండింగ్ ఉంది. ఇప్పటికే రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చిన పవన్ కూడా ఆ పనులు పెండింగ్ ఉంటాయి. మరి పవన్.. సురేందర్ రెడ్డికి డేట్స్ ఇస్తారో లేదో.. సినిమా చేస్తారో లేదో.. ఆయన ఆశ నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.
