Begin typing your search above and press return to search.

లైవ్ ఈవెంట్ లో ప‌వ‌న్ ఆలాప‌న ఇదే తొలిసారి!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా మ‌ల్టీట్యాలెంటెడ్. న‌టుడే కాదు అవ‌స‌ర‌మైతే కెప్టెన్ కుర్చీ ఎక్కి సినిమా కూడా డైరెక్ట్ చేయ‌గ‌ల‌రు.

By:  Tupaki Desk   |   24 July 2025 3:41 PM IST
లైవ్ ఈవెంట్ లో ప‌వ‌న్ ఆలాప‌న ఇదే తొలిసారి!
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా మ‌ల్టీట్యాలెంటెడ్. న‌టుడే కాదు అవ‌స‌ర‌మైతే కెప్టెన్ కుర్చీ ఎక్కి సినిమా కూడా డైరెక్ట్ చేయ‌గ‌ల‌రు. `జానీ` సినిమాను ఆయ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన సంగ‌తి తెలి సిందే. అలాగే సీన్స్ విష‌యంలో...యాక్షన్ స‌న్నివేశాల ప‌రంగా ప‌వ‌న్ అవ‌స‌రం మేర ఇన్వాల్వ్ అవు తుంటారు. గాయ‌కుడిగానూ మారిపోతుంటారు. ఈ నాలెడ్జ్ అంతా ప‌వ‌న్ కు తొలి నుంచి ఉంది.ఇప్పుడు పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు కూడా తోడైన నేప‌థ్యంలో క‌థల విష‌యంలో ఆయ‌న ఇన్వాల్వ్ మెంట్ బ‌లంగా ఉంటుంది? అన్న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

`హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు` సినిమాకు రెండ‌వ డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణ‌ను తీసుకుంది కూడా ప‌వ‌నే అన్న సంగ‌తి తెలిసిందే. ఇలా ప‌వన్ కు సినిమా ప‌రంగా చాలా అంశాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉంది. వీర‌మ‌ల్లు సినిమాలో ప‌వ‌న్ పాట‌లు కూడా పాడిన సంగ‌తి తెలిసిందే. ఇలా సినిమాలో పాట పాడ‌టం అన్న‌ది చాలా కాలం త‌ర్వాత జ‌రిగింది. దీంతో సినిమా చూసిన అభిమానులంతా సంతోషంగా ఫీల‌య్యారు. అలాగే ఈ సినిమా వైజాగ్ ఈవెంట్ లోనే ప‌వ‌న్ లైవ్ లోనూ ఓ పాట పాడిన‌ట్లు తెలుస్తోంది.

ప్ర‌త్యేకించి ఆయ‌న‌తో ఈ పాట‌ను సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి పాడించిన‌ట్లు ప‌వ‌న్ భావించారు. `ఈత మాను ఇల్లు కాదు తాటి మాను తావు కాదు త‌గిలినోడు మొగుడు కాదు త‌గ‌రం బంగారం కాదు` అంటూ ఓ పాట పాడారు. ఈ పాట ఉత్త‌రాదికి క‌నెక్ట్ అవుతుంద‌నే ఉద్దేశంతోనే కీర‌వాణి త‌న నోట పాడించిన‌ట్లు ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ప‌వ‌న్ పాట పాడుతోన్న స‌మ‌యంలో చాలా ఉత్సాహంగా క‌నిపించారు. పవ‌న్ ఆ పాట పాడుతోన్న సమ‌యం లో ప్రాంగ‌ణం కూడా కేరింత‌ల‌తో ద‌ద్ద‌రిల్లింది.

ప‌వ‌న్ అభిమానులు లైవ్ లోనే స్టెప్ అందుకున్నారు. ఇలాంటి పాట‌లు హ‌మ్ చేయ‌డం అంటే ప‌వ‌న్ కు బాగా ఇష్టం. అయితే ఇలా లైవ్ ఈవెంట్ లో ప‌వ‌న్ ఆల‌పించ‌డం అన్న‌ది ఇదే తొలిసారి. ఇంత వ‌ర‌కూ ఏ సినిమా ఈవెంట్ లో ప‌వ‌న్ పాట‌లు పాడ‌లేదు. ఆయ‌న సిగ్గ‌రి. అయితే రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత ప‌బ్లిక్ మీటింగ్ లో బాగా అల‌వాటు అవ్వ‌డంతో ఆయ‌నలో సిగ్గ‌రి పోయాడు.