ఆ రెండు సినిమాలకు పవన్ పారితోషికం వద్దన్నాడా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం అందుకుంటారు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఆయనకు పేరుంది.
By: Tupaki Desk | 17 May 2025 6:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు భారీగా పారితోషికం అందుకుంటారు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా ఆయనకు పేరుంది. అదే పవన్ లో అంతే సానుభూతి కూడా ఉంటుందన్నది అందిరికీ తెలిసిందే. ఆయన నటించిన హిట్ అయితే పర్వాలేదు. అదే సినిమా ప్లాప్ అయితే నిర్మాతను దృష్టిలో పెట్టుకుని పారితోషికంలో మినహాయింపులుఇస్తుంటారు.
ఒక్కోసారి రూపాయి కూడా తీసుకోకుండా తీసుకున్న అడ్వాన్స్ నే తిరిగి ఇచ్చేస్తుంటారు. ఇలా అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేయడం అన్నది ఆయనకు మాత్రమే చెల్లింది. అందుకే పవన్ నటుడిగా కంటే గొప్ప వ్యక్తిత్వం.. దాతృహృ దయం కలిగిన మనిషిగా అభిమానుల్లోకి బలంగా వెళ్లిపోయాడు. తాజాగా పవన్ మరోసారి తన దాతృహృ దయాన్ని చాటుకున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా మూడు సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
`హరిహరవీరమల్లు`, `ఓజీ` , `ఉస్తాద్ భగత్ సింగ్` సినిమాలు చేస్తున్నారు. ఇటీవలే వీరమల్లు షూటింగ్ కూడా పూర్తిచేసారు. జూన్ లో సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా సెట్స్ లో ఉండగానే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మొదలు పెట్టారు. ఈ రెండు సినిమాలకు కలిపి పవన్ 30 కోట్లకు పైగా అడ్వా న్సులు తీసు కున్నారు. వీరమల్లు కోసం 20 కోట్లు తీసుకోగా, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం 15 కోట్లు తీసుకున్నారుట.
ఇటీవలే ఆ చిత్ర నిర్మాతలను పవన్ అమరావతికి పిలిపించి మాట్లాడారుట. రెండు సినిమా రిలీజ్ లు బాగా ఆలస్యమవ్వడంతో బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వొద్దని జాలి చూపించారుట. తన వల్ల తమ సినిమాలకే కొంత నష్టం వచ్చిందని....వాటన్నింటిని మర్చిపోయి సినిమా రిలీజ్ లు సవ్యంగా అయ్యేలా చూడమని...అదే తనకు ఇచ్చే బ్యాలెన్స్ పారితోషికం అని మాట్లాడారుట. మొత్తానికి మరోసారి పవన్ తన దాతృ హృదయాన్ని చాటుకున్నట్లు తెలుస్తుంది.
