OG రేంజ్ హైప్ వీరమల్లుకు ఎందుకు లేదు? పవన్ ఏమన్నారంటే?
అయితే ఓజీ ప్రోమోలో వయొలెన్స్ ఎక్కువగా ఉండడం, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కనిపించడం వల్ల ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారేమోనని అభిప్రాయపడ్డారు.
By: Tupaki Desk | 23 July 2025 6:42 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలు.. 2025లోనే రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మరికొన్ని గంటల్లో పెయిడ్ ప్రీమియర్స్ తో వీరమల్లు సందడి చేయనుండగా.. సెప్టెంబర్ 25వ తేదీన ఓజీ వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే వీరమల్లు సినిమా కన్నా ఓజీ సినిమాకే ఆడియన్స్ తోపాటు ఫ్యాన్స్ లో ఎక్కువ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. అందుకు కారణాలు ఏమైనా అది మాత్రం నిజం. ఇప్పటికే ఆ విషయంపై వీరమల్లు నిర్మాత ఏఎం రత్నంతోపాటు దర్శకుడు జ్యోతి కృష్ణ రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు పవన్ కూడా స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో ఓజీకి వచ్చిన హైప్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు ఎందుకు రాలేదనే ప్రశ్న ఎదురవ్వగా.. దానికి ఏ సినిమాకు అన్న ప్రత్యేకత ఆ సినిమాకు ఉంటుందని పవన్ తెలిపారు. ప్రతీ చిత్రానికి యూనిక్ పొజిషినింగ్ ఉంటుందని చెప్పారు. కొన్ని సినిమాలకు ఎక్కువగా, మరికొన్నింటికి తక్కువగా హైప్ ఉంటుందని పేర్కొన్నారు.
కొన్నిసార్లు ఆడియన్స్ ఎక్కువగా వయొలెన్స్ ఇష్టపడుతున్నారని.. గ్రే షేడ్స్ ను నచ్చుతున్నారని తెలిపారు. ఒకప్పుడు హీరో అంటే రాముడు అన్నట్లు ఉండే వారని.. ఇప్పుడు అలా కాదని చెప్పారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను ఎక్కువగా ఇష్టపడుతున్నారని, ఆ రోల్స్ కు ఎక్కువ ఆదరణ దక్కుతుందని చెప్పారు.
అయితే ఓజీ ప్రోమోలో వయొలెన్స్ ఎక్కువగా ఉండడం, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కనిపించడం వల్ల ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారేమోనని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో వీరమల్లు మూవీలో ఎన్నో స్పెషల్స్ ఉన్నాయని తెలిపారు. మంచి రెస్పాన్స్ అందుకుంటుందని అన్నారు.
కాగా, ఓజీ క్యాచీ టైటిల్ కావడం వల్ల ఫ్యాన్స్ వెంటనే కనెక్ట్ అయ్యారని నిర్మాత రత్నం అన్నారు. ఓజీ యాక్షన్ మూవీ కావడంతోపాటు దాని టీజర్ ఆకట్టుకోవడం వల్ల హైప్ పెరిగిందని డైరెక్టర్ జ్యోతి కృష్ణ తెలిపారు. కరోనా కారణంగా తమ సినిమా వాయిదా పడిందని, అందుకే అలా జరిగి ఉండొచ్చని అన్నారు. ఇప్పుడు పవన్ మాత్రం ఏ స్పెషల్ దానికుంటుందని చెప్పారు.
