Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ లాంగ్ గ్యాప్ ప్లాన్ చేస్తున్నాడా?

2029 ఎన్నిక‌లైనా ప్ర‌యాణం అధికార టీడీపీతోనే ఉంటుంది. కాబ‌ట్టి ఆ ర‌కంగానూ ఎలాంటి ఇబ్బంది త‌లెత్తే అవ‌కాశం లేదు.

By:  Tupaki Desk   |   23 July 2025 7:00 AM IST
ప‌వ‌న్ లాంగ్ గ్యాప్ ప్లాన్ చేస్తున్నాడా?
X

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ షూటింగ్ లు పూర్తి చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ వారం లోనే `హ‌రిహ‌రవీర‌మ‌ల్లు` రిలీజ్ అవుతుంది. ఇప్ప‌టికే ఆ సినిమా ప్ర‌చారం ప‌నుల్లో కూడా పాల్గొన్నారు. దీంతో ఆ సినిమాకు సంబంధించి పీకే పూర్తిగా రిలీవ్ అయినట్లే. అటు `ఓజీ` షూటింగ్ కూడా వేగంగా పూర్త వుతుంది. ఆ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ లో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ త‌ర్వాత ఆసినిమా నుంచి కూడా రిలీవ్ అయిట‌న్లే. ఇప్ప‌టికే `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు.

ఓవైపు పాలిటిక్స్ ప‌నులు చూసుకుంటూనే ఉస్తాద్ సెట్స్ కు హాజ‌ర‌వుతున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగానే పూర్తి చేస్తున్నారు. రెండు నెల‌ల్లోనూ షూటింగ్ మొత్తం పూర్తిచేసే ప్ర‌ణాళిక‌తో హ‌రీష్ శంక‌ర్ ముందుకెళ్తున్నాడు. ఈసినిమా మాత్రం వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. మ‌రి అటుపై ప‌వ‌న్ కొత్త సినిమా ఏది? అవుతుంద‌నే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది. కానీ అస‌లు సంగ‌తేంటి? అంటే ప‌వ‌న్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రిలీజ్ అనంత‌రం లాంగ్ గ్యాప్ తీసుకుంటార‌ని ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి లీకైంది.

ఏకంగా మూడేళ్ల పాటు ఎలాంటి సినిమాలు చేయ‌కూడ‌ద‌ని భావిస్తున్నారుట‌. ఈ స‌మ‌యాన్ని పూర్తిగా రాజ‌కీయాల‌కు కేటాయించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి మ‌రో 15 ఏళ్ల ప‌నిచేస్తాన‌ని ప‌వ‌న్ ప్రామిస్ చేసిన నేప‌థ్యంలో ఆ దిశ‌గా ప్ర‌జ‌ల్లోకి ఎంత బ‌లంగా వెళ్లాలి? అన్న ఆలోచ‌న‌ల‌తోనే ప‌వ‌న్ ఉన్న‌ట్లు తెలిసింది. ఇదే నిజ‌మైతే ప‌వ‌న్ సినిమాలు చేసేది మ‌ళ్లీ ఎన్నిక‌ల త‌ర్వాతే అవుతుంది. ఈ లోగా జ‌మిలి ఎన్నిక‌లు వచ్చినా? ప‌వ‌న్ కి ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు.

2029 ఎన్నిక‌లైనా ప్ర‌యాణం అధికార టీడీపీతోనే ఉంటుంది. కాబ‌ట్టి ఆ ర‌కంగానూ ఎలాంటి ఇబ్బంది త‌లెత్తే అవ‌కాశం లేదు. ఇవ‌న్నీ ఆలోచించుకునే ప‌వ‌న్ కూడా కొత్త క‌థలేవి విన‌డం లేదుట‌. అలాగే నిర్మాత‌ల ద‌గ్గ‌ర అడ్వాన్సులు కూడా తీసుకోవ‌డం లేదుట‌. ఇప్ప‌టికే తీసుకున్న అడ్వాన్సులు కూడా తిరిగి ఇచ్చేస్తున్నార‌ని తెలిసింది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తేలాలి.