Begin typing your search above and press return to search.

ఈ సారి సంక్రాంతి 'ప‌వ‌ర్‌' ప్యాక్ అయిపోద్దా?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ ప‌క్క రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గ‌డిపేస్తూనే వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తున్నారు.

By:  Tupaki Entertainment Desk   |   7 Feb 2026 11:02 PM IST
ఈ సారి సంక్రాంతి ప‌వ‌ర్‌ ప్యాక్ అయిపోద్దా?
X

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఓ ప‌క్క రాజ‌కీయాల్లో బిజీ బిజీగా గ‌డిపేస్తూనే వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రిస్తున్నారు. అబిమానుల కోరిక మేర‌కు మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో అభిమానుల్ని స‌ర్‌ప్రైజ్ చేస్తూ వ‌స్తున్నారు. గ‌త ఏడాది హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామా `ఓజీ`తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ప‌వ‌న్ ఈ సినిమాతో ఫ్యాన్స్ ఆక‌లి తీర్చారు. కొంత కాలంగా ప‌వ‌న్ మార్కు యాక్ష‌న్ కోసం ఎదురు చూస్తున్న అభిమానుల‌కు `ఓజీ`తో ఫుల్ మీల్స్ పెట్టారు. బాక్సాపీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించారు.

అదే ఊపుతో..అదే జోష్‌తో మార్చిలో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌`తో రాబోతున్నాడు. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్‌లో ప‌వ‌న్ న‌టిస్తున్న మూవీ ఇది. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ `తేరీ`కిది రీమేక్‌. కానీ కాద‌ని డైరెక్ట‌ర్ వాదిస్తున్నాడు. కార‌ణం తెలుగు మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`ని మార్చి `జ‌న నాయ‌గ‌న్‌`గా మార్పులు చేసి తీసిన‌ట్టుగానే ఈ మూవీని కూడా `తేరీ`లో మార్పులు చేసి తీసిన‌ట్టుగా తెలుస్తోంది. శ్రీ‌లీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్‌లుగా న‌టిస్తున్న ఈ మూవీపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఇప్ప‌టికే ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాల్ని పెంచేసిన ఈ మూవీని మార్చి 26న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది ఉంటే మ‌రో మూవీని కూడా ప‌వ‌న్ రాకెట్ స్పీడుతో ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ష‌న్‌లో రామ్ తాళ్లూరి ఈ భారీ ప్రాజెక్ట్‌ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. వ‌క్కంతం వంశీ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ మూవీ ఫైన‌ల్‌గా సెట్‌స‌పైకి రాబోతోంది. ఉగాది సంద‌ర్భంగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ మూవీని 2027 సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఏకంగా డేట్‌ని కూడా టీమ్ ఫైన‌ల్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న రిలీజ్ చేయాల‌ని రిలీజ్ డేట్‌ని కూడా ఫైన‌ల్ చేసిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రీప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అనుకున్న వ‌న్నీ అనుకున్న‌ట్టుగా జ‌రిగితే సంక్రాంతికి బ‌రిలోకి దిగాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు. గ‌త కొంత కాలంగా సురేంద‌ర్‌రెడ్డి, వ‌క్కంతం వంశీ స‌రైన స‌క్సెస్ కోసం చూస్తున్నారు.

ప‌వ‌న్ ప్రాజెక్ట్‌తో ప‌వ‌ర్ ప్యాక్డ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని భావిస్తున్నార‌ట‌. సురేంద‌ర్‌రెడ్డి, వ‌క్కంతం వంశీల కాంబినేష‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సూప‌ర్ హిట్ సినిమాలొచ్చాయి. మ‌ళ్లీ ఆ మ్యాజిక్‌ని ఈ మూవీతో రిపీట్ చేయాల‌ని ప‌క్కాగా ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. సురేంద‌ర్‌రెడ్డి స్టైల్ యాక్ష‌న్‌.. ప‌వ‌న్ మార్కు మాస్ ఎలిమెంట్స్ క‌లిస్తే 2027 సంక్రాంతి ఫుల్‌మాస్ ఫెస్టివెల్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని అంతా అంటున్నారు.