సెలూన్ ఓపెన్ చేసిన పవన్.. అది ఎవరిదో తెలుసా?
టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 9 Jun 2025 12:08 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అటు పాలనా వ్యవహారాలు.. ఇటు సినిమాలు.. రెండూ చూసుకుంటున్నారు. ఇప్పటికే తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల షూటింగ్ లను ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నారు. అలా పవన్ సాబ్ తీరిక లేకుండా గడుపుతున్నారు.
అంతటి బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు సెలూన్ ప్రారంభోత్సవానికి హాజరవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన 'కొనికి' అనే సెలూన్ ను పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి ప్రారంభించారు.
ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్.. స్కై బ్లూ కలర్ టీషర్ట్, బ్లాక్ షార్ట్, ఫుల్ టైట్ షూస్ వేసుకుని వచ్చారు. ఒక్కసారిగా తన పాత స్టైల్ ను గుర్తు చేశారు. ఒకప్పుడు స్టైల్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆయన.. ఇప్పుడు సెలూన్ ఓపెన్ చేసేందుకు డిఫరెంట్ లుక్ లో వచ్చారు. ఒక్కసారిగా పవన్ చూసి అంతా ఫుల్ గా షాకైయిపోయారు.
డిప్యూటీ సీఎం అయ్యాక ఆ రేంజ్ లో కనిపించడం ఇదే తొలిసారి కాగా.. క్యాజువల్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. అందుకు సంబధించిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. పవన్ ట్రెండీ లుక్ ను ఫ్యాన్స్, నెటిజన్లు తెగ ట్రెండ్ చేస్తున్నారు. అదే సమయంలో సెలూన్ ఓనర్ ఎవరోనని మాట్లాడుకుంటున్నారు.
అయితే కానూరులో తాజాగా పవన్ కళ్యాణ్ ఓపెన్ చేసిన కొనికి సెలూన్.. ఇప్పటికే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉంది. సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిష్ట్ గా వ్యవహరించే రామ్ కొనికి దానిని కొన్నేళ్లుగా విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఆయనే కానూరులో కొనికి సెలూన్ ను ఏర్పాటు చేశారు.
కాగా, రామ్ కొనికికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. వారిద్దరి మధ్య కొంతకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరు సన్నిహితంగా ఉంటారు. అలా అత్యంత సన్నిహితుడు కావడం.. పలు సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండటం.. ఇప్పుడు పవన్ ను తన సెలూన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు రామ్ కొనికి. అందుకు అభిమానంగా ఆయన కూడా వచ్చి అంతే సందడి చేశారు. పవన్ రాకతో ఒక్కసారిగా కోలాహలం నెలకొంది.
