భగత్ సింగ్ కోసం పవన్ డేట్లు ఇచ్చేసారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ పెట్టిన షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `హరిహరి వీరమల్లు` షూటింగ్ ముగించారు.
By: Tupaki Desk | 15 May 2025 3:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెండింగ్ పెట్టిన షూటింగ్ లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే `హరిహరి వీరమల్లు` షూటింగ్ ముగించారు. నేటి నుంచి `ఓజీ` సెట్స్ కు కూడా హాజరవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి పవన్ గత ఏడాదే కొంత షూటింగ్ పూర్తి చేసారు. పెండింగ్ షూటింగ్ నేటి నుంచి మొదలు పెట్టారు. గ్యాప్ తీసుకోకుండా హాజరైతే నెల రోజుల్లో చుట్టేస్తారు. ఈనేపథ్యంలోనే పవన్ `ఉస్తాద్ భగత్ సింగ్` షూటింగ్ కూడా షురూ చేస్తున్నట్లు వినిపిస్తుంది.
పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఫోన్ చేసి సిద్దంగా ఉండమని ఆదేశించాడుట. అందుకు హరీష్ కూడా ఎస్ బాస్ అంటూ బధులిచ్చినట్లు సమాచారం. ఈ సినిమా కోసం పవన్ 80 రోజులు కేటాయించాల్సి ఉందిట. దీనిలో భాగంగా జులై నుంచి డేట్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజాలు నిగ్గు తేలాలి. అదే జరిగితే ఏడాది ముగింపు కల్లా చిత్రీకరణ పూర్తవుతుంది. అటుపై సంక్రాంతి రేసులో ఉస్తాద్ ఉంటాడు.
అలా హరీష్ లో పీకే జోష్ నింపుతున్నా? మరోవైపు నిరుత్సాహం కూడా ఉంది. `ఉస్తాద్ భగత్ సింగ్` ఇప్పట్లో రీస్టార్ట్ అవ్వడం కష్టమని భావించిన హరీష్ రామ్...బాలకృష్ణలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతు న్నాడు. ఇద్దరికీ కథలు కూడా చెప్పినట్లు ప్రచారంలో ఉంది. ఏ ప్రాజెక్ట్ కన్పమ్ అవ్వలేదు గానీ ఒకే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నవే. ఇదంతా పీకే రేసులో కి రాకముందు జరిగిన స్టోరీ. అనూహ్యంగా ఇప్పుడా యన రావడంతో బాలయ్య, రామ్ లను హోల్డ్ లో పెట్టాలి.
బాలయ్యతో ఇబ్బందేమి లేదు. ఆయనకు ఇతర డైరెక్టర్లతో కమిట్ మెంట్ ఉంది. కానీ రామ్ చేతుల్లో అన్ని కమిట్ మెంట్లు లేవు. హరీష్ ఒకే అంటే తదుపరి చిత్రాన్ని తనతో చేయాలని లైన్ లో ఉన్నాడు. కానీ ఇప్పుడు సీన్ లో పీకే వచ్చాడు కాబట్టి రామ్ ని కూడా హోల్డ్ లోపెట్టాలి. హరీష్ మరేం చేస్తాడు? అన్నది చూడాలి.
