'ఓజీ' సెట్‌లోకి పవన్ ఇక పూనకాలేనా?
తాజాగా 'ఓజీ' షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. గత కొంత కాలంగా ఫ్యాన్స్‌ని భయాందోళనకు గురి చేసిన ఈ ప్రాజెక్ట్ అందరి భయాల్ని పటాపంచలు చేస్తూ ఫైనల్‌గా మొదలైంది.
By: Tupaki Desk | 13 May 2025 2:26 PMపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ', పీరియాడిక్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్‌గా పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. గతంలో విడుదల చేసిన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. అయితే పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ మూవీ షూటింగ్ గత కొంత కాలంగా ఆగిపోయింది. ముందుకు కదులుతుందా;? లేక మధ్యలోనే ఆగిపోతుందా? అనే అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో ఎట్టకేలకు అందరి ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెట్టారు.
తాజాగా 'ఓజీ' షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. గత కొంత కాలంగా ఫ్యాన్స్‌ని భయాందోళనకు గురి చేసిన ఈ ప్రాజెక్ట్ అందరి భయాల్ని పటాపంచలు చేస్తూ ఫైనల్‌గా మొదలైంది. పలు కీలక ఘట్టాల చిత్రీకరణను ఈ షెడ్యూల్‌లో దర్శకుడు సుజీత్ పూర్తి చేయనున్నాడట. పవన్‌కున్న బిజీ షెడ్యూల్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ షూటింగ్‌ని వీలైనంత ఫాస్ట్‌గా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సోమవారం షూటింగ్ మొదలు కావడంతో బుధవారం నుంచి పవన్ సెట్‌లోకి అడుగు పెట్టబోతున్నారట.
ఇప్పటికే ఆలస్యం అవుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్‌ని పవన్ కేటాయించిన డేట్స్‌లలోనే పూర్తి చేయాలని, అనుకున్న విధంగా షూటింగ్‌ని పూర్తి చేసి వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. ఇక పవన్ ఎప్పుడు సెట్‌లోకి అడుగుపెడితే అప్పుడు ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేస్తామంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే ఫస్ట్ సింగిల్‌ని రిలీజ్ చేస్తారట.
అంటే బుధవారం లేదా గురు వారం ఫస్ట్ సింగిల్ లేదా మరో గ్లింప్స్‌ని రిలీజ్ చేసే అవకాశం ఉందన్నమాట. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్‌లతో పాటు జపాన్ నటుడు కజుకి కిటముర కీలక పాత్రలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్‌తో పాటు పవన్ మరో సినిమాకు కూడా డేట్స్ కేటాయించారు. అదే 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ జూన్ 15 నుంచి తిరిగి ప్రారంభం కాబోతోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.