OG ఒక పెద్ద మార్పు గురించి చెప్పిన కెవిన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ-OG. సుజీత్ దర్శకుడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు.
By: Tupaki Desk | 10 Jun 2025 9:41 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ-OG. సుజీత్ దర్శకుడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 25 సెప్టెంబర్ 2025న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటించగా, ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటించారు. థమన్ సంగీతం సమకూర్చారు. ఇది హై ఆక్టేన్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అని తొలి నుంచి ప్రచారం ఉంది.
`దే కాల్ హిమ్ ఓజీ` అనే ట్యాగ్ లైన్‌తో చాలా క్యూరియాసిటీని పెంచారు. ఈ సినిమా నుండి ప్రతి అప్‌డేట్ ఇంటర్నెట్‌ను హోరెత్తిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే తనపై పెండింగ్ లేకుండా, అన్ని సన్నివేశాల్ని పూర్తి చేసారు. ఇంతలోనే యాక్షన్ కొరియోగ్రాఫర్ కెవిన్ కుమార్ అభిమానులను థ్రిల్ చేసే ఆసక్తికర విషయం చెప్పారు. దర్శకుడు సుజీత్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసి... విజయవాడ యాక్షన్ సీన్ గురించి వెల్లడించారు. పవన్ రా అండ్ స్టైలిష్ ఇంట్రో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ విజయవాడలో పూర్తయిందని వెల్లడించారు. ఈ సీక్వెన్స్ పెద్ద తెరపై అభిమానులకు గూస్ బంప్స్ తెస్తుందని చెప్పారు.
అలాగే ఓజీ సినిమాటోగ్రాఫర్ మారారని కూడా కెవిన్ ధృవీకరించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ స్థానంలో మనోజ్ పరమహంస కొత్త డివోపీగా నియమితులయ్యారు. కెవిన్ తన పోస్ట్‌లో మనోజ్, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఓజీ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో రక్తి కట్టిస్తుందన్న క్లారిటీ ఇప్పటికే వచ్చింది.