Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులో OG..?

ఐతే ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

By:  Tupaki Desk   |   23 May 2025 1:00 PM IST
సంక్రాంతి రేసులో OG..?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ మూవీ మేకర్ సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. సినిమా మొదలై రెండేళ్ల పైన అవుతున్నా ఇప్పటివరకు రిలీజ్ నోచుకోలేదు. సినిమా పూర్తి చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఓజీ ని పూర్తి చేయాలని అనుకుంటున్నారట. నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉన్న హరి హర వీరమల్లుని ఈమధ్యనే కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్.

వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ లాక్ చేశారు. ఇక ఆ సినిమా తర్వాత OG సినిమా పూర్తి చేసేందుకు డేట్స్ ఇచ్చాడని తెలుస్తుంది. సుజిత్ ఓజీ సినిమాను చాలా ఫోకస్ తో చేస్తున్నాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ పర్సనల్ పనుల వల్ల సినిమా లేట్ అవుతూ వచ్చినా ఎక్కడ కూడా ఆ ఫోకస్ ని తగ్గించలేదని తెలుస్తుంది. పవన్ ఓజీ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు థమన్ ఇచ్చే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది.

ఐతే ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఐతే 2026 సంక్రాంతికి ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా రిలీజ్ లాక్ చేశారు. నెక్స్ట్ వెంకటేష్ కూడా ఈసారి సంక్రాంతికి రావాలని చూస్తున్నాడు. ఐతే పవర్ స్టార్ ఓజీ వస్తే మాత్రం చిరంజీవి సినిమా వచ్చే ఛాన్స్ లేదు.

ఈ ఇయర్ గేం ఛేంజర్ కోసం విశ్వంభర సినిమా వాయిదా వేశారు చిరంజీవి. మళ్లీ నెక్స్ట్ ఇయర్ ఓజీ కోసం అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా పోస్ట్ పోన్ చేస్తారా అన్నది చూడాలి. అనిల్ కి సంక్రాంతి సెంటిమెంట్ కాబట్టి ఓజీని కుదిరితే ఈ ఇయర్ క్రిస్ మస్ కి తీసుకొచ్చేలా చూస్తారు. లేదా సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి లేదా మార్చి లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తారు. ఐతే ఓజీ ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఇదే కాదు పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.