సితార నాగవంశీ చేతికి OG రైట్స్.. ఎంతకు కొన్నారంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "OG" సినిమా పట్ల టాలీవుడ్ లోని ప్రేక్షకుల్లో హై లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి.
By: Tupaki Desk | 18 Jun 2025 6:04 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న "OG" సినిమా పట్ల టాలీవుడ్ లోని ప్రేక్షకుల్లో హై లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఓ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో పవన్ లుక్, మేకింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించాయి. హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి వన్ బై వన్ గా అప్‌డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడైతే బిజినెస్ పరంగా మరో ఇంట్రస్టింగ్ విషయమే బయటపడింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ విలన్ ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు టెక్నికల్ గా బలమైన టీమ్ వర్క్ చేస్తోంది. OG చిత్రాన్ని దాదాపు రూ. 250 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. దాంతోపాటు థియేట్రికల్ రైట్స్, డిజిటల్, శాటిలైట్ హక్కులు ఇప్పటి నుంచే హాట్ కేక్‌లా మారిపోయాయి.
లేటెస్ట్ గా వచ్చిన సమాచారం ప్రకారం, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ, OG సినిమా సీడెడ్ ఏరియా థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేశారు. ఈ హక్కులను ఆయన ఏకంగా రూ. 24 కోట్లకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. రాయలసీమ ఏరియాలో పవన్ కల్యాణ్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇది రిజనబుల్ డీల్ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో పవన్ సినిమాలు అక్కడ బంపర్ ఓపెనింగ్స్ సాధించిన నేపథ్యం ఈ డీల్‌కు బలంగా నిలిచింది.
సాధారణంగా రాయలసీమలో పెద్ద సినిమాల బిజినెస్ రూ. 15-20 కోట్లు మధ్యలో జరుగుతుండగా, OG కి మాత్రం ఇది బ్రేక్ ది రికార్డ్ రేంజ్ డీల్ కావడం గమనార్హం. పవన్ బ్రాండ్ వాల్యూ, OG యాక్షన్ థ్రిల్లర్ కాన్సెప్ట్, మరియు మేకర్స్ ప్రమోషన్ పైనే ఈ రేంజ్ బిజినెస్ నిలబడినట్టు తెలుస్తోంది. మరోవైపు, నాగవంశీ సితార బ్యానర్ తక్కువ సినిమాలను రిలీజ్ చేసినా, ప్రతి ప్రాజెక్ట్‌ను వ్యూహాత్మకంగా ఎంపిక చేస్తూ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పటికే OG నైజాం, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణ, గుంటూరు తదితర ఏరియాల్లో రైట్స్ భారీ ధరలకు డీల్ అయినట్టు టాక్. ఈ లెక్కన చూస్తే OG థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ టోటల్ గా దాదాపు రూ. 150 కోట్ల దాకా వెళ్ళే అవకాశముంది. OG సినిమాతో పవన్ మళ్లీ బ్లాక్‌బస్టర్ ఫామ్‌లోకి రావడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
