పవన్ న్యూ లుక్.. ఆ దర్శకుడిని తెగ పొగిడేస్తున్న ఫ్యాన్స్!
ఈ లుక్‌తో పవన్ ఎంతో స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపించడంతో అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అయితే ఇది హరిహర వీరమల్లు కోసం సెట్ చేసిన లుక్ కాదు.
By: Tupaki Desk | 22 July 2025 8:39 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నా, సినిమాల మీద తన ఆసక్తిని తగ్గించకుండా కొనసాగిస్తున్నాడు. తాజా సినిమాల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా హరిహర వీరమల్లు ప్రెస్ మీట్‌కి హాజరైన పవన్… తన తాజా లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ లుక్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే సినిమా ఈవెంట్ లో కూడా ఆయన లుక్ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.
ఇప్పటికే ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా జూలై 24న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో పవన్ బ్లాక్ టీషర్ట్, జీన్స్ కాంబినేషన్‌తో సింపుల్‌గా కనిపించినా… ఆయన ఫిట్‌నెస్, యాక్టివ్ ఎనర్జీ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ లుక్‌తో పవన్ ఎంతో స్టైలిష్‌గా, యంగ్‌గా కనిపించడంతో అభిమానుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. అయితే ఇది హరిహర వీరమల్లు కోసం సెట్ చేసిన లుక్ కాదు. ఆయన నటిస్తున్న మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఈ లుక్‌ని మెయింటైన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ స్టైల్, యాటిట్యూడ్ మొత్తం కొత్తగా ఉండబోతున్నాయంటూ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ లుక్‌ను చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ లుక్ పవన్‌కి చాలా బాగుంది’, ‘ పవన్‌ని మళ్లీ ఇలా చూడడం సో హ్యాపీ’ అంటూ పాజిటివ్ గా పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ఈ లుక్ వెనక ఉన్న హరీష్ శంకర్‌కు ఫ్యాన్స్ ప్రత్యేక థ్యాంక్స్ చెబుతున్నారు. హరీష్ కూడా వారికి స్పందిస్తూ ‘పవన్ కోసం ఎప్పుడైనా రెడీ’ అంటూ అభిమానుల మనసు గెలుచుకున్నారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రం కూడా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. పవన్ అభిమానులు ఇప్పుడు రెండు సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవైపు హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమవుతుంటే, మరోవైపు భగత్ సింగ్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. అలాగే OG కూడా లైన్ లో ఉన్న విషయం తెలిసిందే. పవన్ లుక్‌తో పాటు రానున్న ఈ సినిమాలపై అభిమానుల్లో నమ్మకం మరింత పెరిగింది.
