Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ సినిమాలు.. ఏదొక క్లారిటీ తెచ్చుకుంటే బెట‌ర్!

ఈ రెండు సినిమాల్లో వీర‌మ‌ల్లు మే 9న రానుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేసి పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   22 April 2025 7:00 AM IST
ప‌వ‌న్ సినిమాలు.. ఏదొక క్లారిటీ తెచ్చుకుంటే బెట‌ర్!
X

ప‌వ‌న్ చేతిలో ప్ర‌స్తుతం హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాల్లో వీర‌మ‌ల్లు మే 9న రానుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేసి పోస్ట‌ర్ ను కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఒక‌వేళ వీర‌మ‌ల్లుని మే 9న రిలీజ్ చేసేట్లైతే ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ మొద‌లు పెట్టాల్సి ఉండేది.

కానీ అలాంటివేం లేవు. అప్పుడెప్పుడో రిలీజ్ డేట్ అంటూ రిలీజ్ చేసిన పోస్ట‌ర్ త‌ప్పించి వీర‌మ‌ల్లు నుంచి మ‌రో ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ రాలేదు. రిలీజ్ కు 20 రోజులే ఉన్న నేప‌థ్యంలో వీర‌మ‌ల్లు వాయిదా మ‌రోసారి త‌ప్ప‌ద‌ని అంద‌రూ ఫిక్సై పోయారు. దీంతో ఇప్పుడంద‌రి దృష్టి ఓజిపైకి మ‌ళ్లింది. ఓజి కోసం ప‌వ‌న్ మే లో డేట్స్ అడ్జ‌స్ట్ చేస్తార‌ని గంపెడాశ‌ల‌తో ఉన్నారు డైరెక్ట‌ర్ సుజిత్, నిర్మాత దాన‌య్య‌.

అయితే ప‌వ‌న్ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌గ‌ల‌గే సిట్యుయేష‌న్ లో ఉంటే ముందు వీరమ‌ల్లు సినిమాకే ఇస్తారు. ఎందుకంటే ఆ సినిమా మొద‌లై ఇప్ప‌టికే చాలా ఏళ్ల‌వుతోంది. దానికి తోడు ఏఎం ర‌త్నంకు ప‌వ‌న్ మాటిచ్చారు. అంద‌రికంటే ముందు త‌న సినిమానే పూర్తి చేస్తాన‌ని. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ వీర‌మ‌ల్లు కంటే ముందు ఓజికి డేట్స్ ఇచ్చే ఛాన్సులు లేవు.

పైగా వీర‌మ‌ల్లుకు ఆల్రెడీ ప్రైమ్ నుంచి డెడ్ లైన్ ఉంది. కాబ‌ట్టి సినిమాను మే లో రిలీజ్ చేయ‌క‌లేక‌పోయినా జూన్ లో అయినా రిలీజ్ చేయాలి. లేక‌పోతే చాలా న‌ష్ట‌మొస్తుంది. మ‌రోవైపు ఓజికి కూడా ఈ స‌మ‌స్య ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం ప్ర‌కారం ఓజిని 2025లో థియేటర్ లో రిలీజ్ చేయాలి. కానీ ప‌రిస్థితులు చూసుకుంటే అది కుదిరే ప‌నేనా అనిపిస్తుంది.

అందులోనూ కేవ‌లం నాలుగు నెల‌ల తేడాతో ప‌వ‌న్ నుంచి రెండు సినిమాలంటే అస‌లు న‌మ్మలేం. దానికి తోడు ఓజిలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కోసం ప‌వ‌న్ లుక్ పై డీ ఏజింగ్ టెక్నాల‌జీ వాడుతున్నాడ‌ట సుజిత్. ఆల్రెడీ దానిపై సుజిత్ చాలా వ‌ర్క్ చేశాడ‌ని అంటున్నారు. ఈ వార్త నిజ‌మైతే దాని కోసం ఎంతో టైమ్ ప‌డుతుంది. కానీ నెట్‌ఫ్లిక్స్ తో డీల్ ప్ర‌కారం ఓజి మేక‌ర్స్ ద‌గ్గ‌ర అంత టైమ్ లేదు. కాబ‌ట్టి ఇప్పుడు వాళ్ల‌కున్న ఒకే ఒక ఆప్ష‌న్ నెట్‌ఫ్లిక్స్ టీమ్ ను మేనేజ్ చేసుకోవ‌డ‌మే. వీలైనంత త్వ‌ర‌గా ఈ విష‌యంలో క్లారిటీ తెచ్చుకుంటే ఫ్రీ గా సినిమాను పూర్తి చేయొచ్చు డైరెక్ట‌ర్ సుజిత్.