పవన్ డెడికేషన్ ను మెచ్చుకోవాల్సిందే
ఈ ట్రైలర్ లోని కొన్ని పోరాట సన్నివేశాల్లో పవన్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించగా, ట్రైలర్ లోని స్టిల్స్ ను, పవన్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలోని ఫోటోలను కంపేర్ చేస్తూ నెటిజన్లు పవన్ ను ప్రశంసిస్తున్నారు.
By: Tupaki Desk | 6 July 2025 2:55 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద స్టార్ హీరో అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన జస్ట్ స్క్రీన్ పై కనిపిస్తే చాలనుకునే అభిమానులెంతో మంది ఉన్నారు. కేవలం యాక్టింగ్ తోనే కాకుండా మార్షల్ ఆర్ట్స్ తో కూడా ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసే హీరోల్లో పవన్ ఒకరు. పవన్ తను నటించిన గత సినిమాల్లో ఎక్కడో ఓ చోట మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపిస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో హరి హర వీరమల్లు కూడా ఒకటి. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న ఈ సినిమాను క్రిష్ మొదలుపెట్టగా, ఏఎం జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమా కోసం పవన్ కొన్ని ప్రత్యేక కసరత్తులు కూడా నేర్చుకున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అయితే రీసెంట్ గా వీరమల్లు ట్రైలర్ రిలీజైన సంగతి తెలిసిందే.
ఈ ట్రైలర్ లోని కొన్ని పోరాట సన్నివేశాల్లో పవన్ మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించగా, ట్రైలర్ లోని స్టిల్స్ ను, పవన్ రిహార్సల్స్ చేస్తున్న సమయంలోని ఫోటోలను కంపేర్ చేస్తూ నెటిజన్లు పవన్ ను ప్రశంసిస్తున్నారు. ఈ రిహార్సల్స్ ఫోటోల్లో పవన్ కళ్యాణ్ లాంగ్ హెయిర్ తో తన మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ కు ట్రైనర్ తో కలిసి మరోసారి పదును పెట్టగా యాక్షన్ ఫోటోల్లో పవన్ ఫ్రేమ్ లో సరిగ్గా సరిపోయారని, ఏదేమైనా పవన్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ అతని డెడికేషన్ ను మెచ్చుకోవాల్సిందేనని అతని ఫ్యాన్స్ తెగ పొగుడుతున్నారు.
17వ శతాబ్ధంలో మొగులుల కాలం నాటి వీరమల్లు జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ నుంచి చాలా రోజుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.